యోగా మన జీవితంలో ఒక భాగమవ్వాలి

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శారీరక మానసిక శక్తిని పెంపొందించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం యోగాలోని ప్రాణాయామాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లోని ప్రత్యేక బలగాలు, హోమ్ గార్డులు, ఇతర సిబ్బందికి నిర్వహించిన యోగా తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గమని, ఇందుకు గానూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. అదే […]

Update: 2020-07-28 05:23 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శారీరక మానసిక శక్తిని పెంపొందించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం యోగాలోని ప్రాణాయామాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లోని ప్రత్యేక బలగాలు, హోమ్ గార్డులు, ఇతర సిబ్బందికి నిర్వహించిన యోగా తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గమని, ఇందుకు గానూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. అదే విధంగా యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటివి చేయడం తప్పనిసరి సూచించారు. ప్రజలను, సమాజాన్ని రక్షించే గురుతర బాధ్యత కలిగిన పోలీసులు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరమని భావించిన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి , సిబ్బంది, కుటుంబాల బాగోగుల కోసం అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, మనకోసం ఎదురుచూసే ప్రజలను కాపాడేందుకు పోలీసుశాఖ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పోలీసు వృత్తిలో ఉన్న సిబ్బంది శిక్షణాకాలం నుంచి , సహజంగానే వ్యాయామాలకు అలవాటు పడి ఉంటారని, పని ఒత్తిడి వలన ఏర్పడిన అలసత్వాన్ని వదిలి యోగ చేయడానికి ఇంకొంత సమయాన్ని వెచ్చించాలని అదనపు ఎస్పీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు వేస్తూ సిబ్బందిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పల నాయుడు, ఆర్ఎస్ఐ నర్సింహ, పోలీసు సంఘ పెద్దలు వెంకటయ్య, మద్దిలేటి, యోగాలో ప్రత్యేక శిక్షణ పొందిన హెడ్‌కానిస్టేబుల్ వనజ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News