ఆంధ్రా పోలీసులు మానవత్వం ప్రదర్శించాలి : ఎస్పీ రంగనాథ్
దిశ, నల్లగొండ: సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న వలస కూలీల పట్ల ఆంధ్రా పోలీసులు మానవతా హృదయంతో వ్యవహరించాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించకపోవడంతో సరిహద్దులలో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆంధ్రా పోలీసులతో సంప్రదింపులు జరిపారు. ఎస్పీ రంగనాథ్ స్వయంగా పొందుగుల చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లి ఆంధ్రా అధికారులకు పరిస్థితిని వివరించడంతో పాటు గుంటూరు ఐజి, ఎస్పీలతో ఫోనులో మాట్లాడారు. […]
దిశ, నల్లగొండ: సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న వలస కూలీల పట్ల ఆంధ్రా పోలీసులు మానవతా హృదయంతో వ్యవహరించాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించకపోవడంతో సరిహద్దులలో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆంధ్రా పోలీసులతో సంప్రదింపులు జరిపారు. ఎస్పీ రంగనాథ్ స్వయంగా పొందుగుల చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లి ఆంధ్రా అధికారులకు పరిస్థితిని వివరించడంతో పాటు గుంటూరు ఐజి, ఎస్పీలతో ఫోనులో మాట్లాడారు. వాడపల్లి వద్ద పడిగాపులు పడుతున్న ప్రయాణికుల బాధలను వారికి తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ఆంధ్రా పోలీసు అధికారులను కోరారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న కార్మికుల బాధను అర్థం చేసుకోవాలని వివరించారు. పడిగాపులు పడుతున్నవారికి అల్పాహారం, భోజనం అందించడంతో పాటు స్వస్థలాలకు చేర్చడానికి ఎస్పీ తీసుకున్న చొరవ పట్ల కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్, డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, రూరల్ సిఐ రమేష్ బాబు, పలువురు పోలీసు అధికారులున్నారు.
Tags: Nalgonda,Vadapally, checkpost,sp Ranganath Inspect