జహీరాబాద్‌లో లాక్‌డౌన్ పరిశీలన : ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖరెడ్డి శనివారం మధ్యాహ్నం పర్యటించారు. కరోనా వ్యాధి నివారణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలను పోలీసు అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక డీఎస్పీ గణపతి జాదవ్ జహీరాబాద్‌లోని పరిస్థితులను […]
దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖరెడ్డి శనివారం మధ్యాహ్నం పర్యటించారు. కరోనా వ్యాధి నివారణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలను పోలీసు అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక డీఎస్పీ గణపతి జాదవ్ జహీరాబాద్‌లోని పరిస్థితులను ఎస్పీకి సంక్షిప్తంగా వివరించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించిన గడి ప్రాంతంలో కూడా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tags: carona, lockdown, zahirabad, sp chandra shekar reddy