‘కీలక సంస్కరణలు అవసరం’
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం సంకోచించవచ్చని గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. కొవిడ్-19 వల్ల భారత, ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా క్షీణించే అవకాశాలున్నాయని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాత్రం భారత జీడీపీ వృద్ధి రేటు భారీగా 10 శాతానికి పుంజుకుంటుందని ఎస్ అండ్ పీ నివేదిక తెలిపింది. పెట్టుబడులపై […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం సంకోచించవచ్చని గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. కొవిడ్-19 వల్ల భారత, ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా క్షీణించే అవకాశాలున్నాయని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాత్రం భారత జీడీపీ వృద్ధి రేటు భారీగా 10 శాతానికి పుంజుకుంటుందని ఎస్ అండ్ పీ నివేదిక తెలిపింది. పెట్టుబడులపై దృష్టి సారించడం, దేశీయంగా ఉద్యోగాలను సృష్టించడం వంటి కీలకమైన సంస్కరణలు తీసుకుంటే రికవరీ సాధ్యమవుతుందని ఎస్ అండ్ పీ సంస్థ అభిప్రాయపడింది.
కరోనా వ్యాప్తికి తోడు, లాక్‌డౌన్ ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, ఇదివరకే మందగమనంలో ఉండటం వల్ల ఈ ప్రభావం అధికంగా ఉందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోక తప్పదని, ఇదివరకు ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ తక్కువని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. ఇప్పటికే పలుమార్లు అవసరమైన సమయంలో ప్రకటిస్తామని చెబుతున్నప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని పేర్కొంది. అలాగే, ప్రభుత్వంపై పెరిగిపోతున్న రుణభారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.