కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో తక్కువ ధరకే గోల్డ్ కొనండి ఇలా…

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన సావరిన్‌ గోల్డ్ బాండ్ స్కీమ్ సోమవారం(జూలై 12) నుంచి మళ్లీ ప్రారంభమైంది. జూన్ 16వ తేదీ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండడంతో పసిడి ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం గ్రాము ధర రూ. 4, 807 ఉండగా.. గ్రాముకు రూ. 50 తగ్గిస్తూ.. ఆన్‌లైన్‌ ధరఖాస్తుదారులు, డిజిటల్ చెల్లింపుదారులకు బాండ్‌‌ల రూపంలో రూ. 4,757లకే విక్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ను సేవింగ్స్‌లోకి […]

Update: 2021-07-13 00:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన సావరిన్‌ గోల్డ్ బాండ్ స్కీమ్ సోమవారం(జూలై 12) నుంచి మళ్లీ ప్రారంభమైంది. జూన్ 16వ తేదీ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండడంతో పసిడి ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం గ్రాము ధర రూ. 4, 807 ఉండగా.. గ్రాముకు రూ. 50 తగ్గిస్తూ.. ఆన్‌లైన్‌ ధరఖాస్తుదారులు, డిజిటల్ చెల్లింపుదారులకు బాండ్‌‌ల రూపంలో రూ. 4,757లకే విక్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ను సేవింగ్స్‌లోకి మార్చడానికి.. ప్రభుత్వం క్యాలెండర్‌ ప్రకారం ఏడాదికి ఆరు సార్లు గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా గోల్డ్‌ బాండ్‌ కొనుగోలుకు అవకాశం ఉండగా.. బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు ఉంది. ఇందులో భాగంగా ఒక్కో ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News