కేరళకు మే 31న నైరుతి రుతుపవనాలు

తిరువనంతపురం: ఈ నెల 31వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. మాల్దీవ్ కొమొరిన్ రీజియన్‌లో పవనాలు వేగమయ్యాయని పేర్కొంది. రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణ ఏర్పడుతున్న తరుణంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులుగా స్వల్ప వర్షాలు పడుతున్నాయి. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, లడాఖ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రీ మాన్సూన్ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాపాతం […]

Update: 2021-05-27 11:43 GMT

తిరువనంతపురం: ఈ నెల 31వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. మాల్దీవ్ కొమొరిన్ రీజియన్‌లో పవనాలు వేగమయ్యాయని పేర్కొంది. రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణ ఏర్పడుతున్న తరుణంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులుగా స్వల్ప వర్షాలు పడుతున్నాయి. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, లడాఖ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రీ మాన్సూన్ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే 31నాడు కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News