weather update : కేరళను తాకిన రుతుపవనాలు

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ఆగమనం కేరళలోకి గురువారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ఈ సారి వర్షపాతం గతంలో కంటే అధికంగానే ఉంటుందని వాతావరణ అధికారులు […]

Update: 2021-06-03 01:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ఆగమనం కేరళలోకి గురువారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ఈ సారి వర్షపాతం గతంలో కంటే అధికంగానే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. అయితే, రుతుపవనాల ఆగమనానికి ముందురోజే(బుధవారం రాత్రి) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాల కురిసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News