భయం వీడింది..భారత్ బయలుదేరనుంది !

కరోనా వైరస్ భయంతో పెద్ద పెద్ద ఈవెంట్లు, సభలు రద్దవుతున్నాయి. ఆసియా దేశాల్లో పర్యటించేందుకు అందరూ భయపడుతున్నారు. భారత్‌లోనూ 31 కరోనా కేసులు నమోదైన వేళ.. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాత్రం ఎటువంటి భయం లేకుండా భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రేపు బయలుదేరి రానుంది. ఈ మేరకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) ఒక ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌లోని ధర్మశాలకు చేరుకుంటారని చెప్పింది. కరోనా వైరస్ నుంచి […]

Update: 2020-03-07 01:17 GMT

కరోనా వైరస్ భయంతో పెద్ద పెద్ద ఈవెంట్లు, సభలు రద్దవుతున్నాయి. ఆసియా దేశాల్లో పర్యటించేందుకు అందరూ భయపడుతున్నారు. భారత్‌లోనూ 31 కరోనా కేసులు నమోదైన వేళ.. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాత్రం ఎటువంటి భయం లేకుండా భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రేపు బయలుదేరి రానుంది. ఈ మేరకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) ఒక ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌లోని ధర్మశాలకు చేరుకుంటారని చెప్పింది.

కరోనా వైరస్ నుంచి ఎలా దూరంగా ఉండాలో ఆటగాళ్లకు వివరించామని.. వారి ఆరోగ్యాలను కాపాడటం మా కర్తవ్యమని సీఎస్‌ఏ తెలిపింది.. సఫారి ఆటగాళ్లు దుబాయ్ మీదుగా ఢిల్లీకి చేరుకొని అక్కడి నుంచి ధర్మశాల వెళ్తారని.. ఆ తర్వాత లక్నో, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు ఆడతారని వెల్లడించింది. కాగా, సఫారి జట్టు భారత్‌తో మూడు వన్డేలు ఆడే నగరాలతో పాటు ప్రయాణించే నగరాల్లోనూ ఎక్కడా కరోనా ఉన్నట్లు నివేదికలు రాలేదన్నారు. కానీ, ముందు జాగ్రత్తగా జట్టుతో పాటు సీఎస్ఏ ముఖ్య వైద్యాధికారి మంజ్రా ఉంటారని స్పష్టం చేసింది.

Tags: ICC, Southafrica vs India, one-day series, Karona effect, CSA

Tags:    

Similar News