ఐపీఎల్ చరిత్రలో క్రిస్ మోరీస్ రికార్డు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ వేల ప్రారంభమైంది. స్టార్ ఆటగాళ్లను ప్రాంచైజీలు భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. గత సీజన్‌లో కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా అభిమానులకు అవకాశం లేకుండా టోర్నమెంట్ నిర్వహించారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం కొంతమేర తగ్గడంతో ఈసారి అభిమానులను అనుమతించే అవకాశం ఉండటంతో, లైవ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో […]

Update: 2021-02-18 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ వేల ప్రారంభమైంది. స్టార్ ఆటగాళ్లను ప్రాంచైజీలు భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. గత సీజన్‌లో కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా అభిమానులకు అవకాశం లేకుండా టోర్నమెంట్ నిర్వహించారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం కొంతమేర తగ్గడంతో ఈసారి అభిమానులను అనుమతించే అవకాశం ఉండటంతో, లైవ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో మోరీస్‌ డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇంత ధరకు ఇప్పటివరకూ ఏ క్రికెటర్ అమ్ముడు పోలేదు. అంతేగాకుండా మోరీస్‌ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ జట్టు వేలంలో పోటీ పడగా, చివరకు రాజస్థాన్ దక్కించుకున్నది. దీంతో ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా మోరీస్ గుర్తింపు పొందాడు.

అయితే.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్(ఐపీఎల్​) ప్రారంభం నుంచి జరుగుతోన్న వేలంలో విదేశీ ఆటగాళ్లకు ఎప్పుడూ డిమాండ్​ ఉంటుంది. తొలి సీజన్‌లో భారీ ధర పలికిన ఆండ్రూ ఫ్లింటాఫ్ నుంచి నేటి క్రిస్ మోరీస్ వరకూ ఎక్కువ ధర పలికిన క్రికెటర్లలో ఎక్కవ శాతం విదేశీయులే. కాగా, గత సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఆల్‌ రౌండర్ పాట్ కమ్మిన్స్‌ను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.15.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అంతకముందు(2020) ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్‌ను రూ.14.5 కోట్లకు రైజింగ్​ పుణె సూపర్​జెయింట్​ జట్టు సొంతం చేసుకుంది. 2019లో జయదేవ్ ఉనద్కట్, వరుణ్ చక్రవర్తిలను రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లు 8.4 కోట్లకు కొనుగోలు చేశాయి. 2018 లో బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 2017లో మళ్లీ బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పూణే సూపర్జియంట్ 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో షేన్ వాట్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసారు. 2014లో యువరాజ్ సింగ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 కోట్లకు దక్కించుకుంది. కాగా, గత సీజన్‌లో ఎక్కువ ధరకు కోల్‌కత్తా కొనుగోలు చేసిన పాట్ కమ్మిన్స్‌ అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి ఈసారి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రిస్‌ మోరీస్ అయిన న్యాయం చేస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News