బీ అలర్ట్.. కొత్తగా మరో ‘కరోనా’!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా వణికిపోతుండగా.. తాజాగా దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా స్ట్రెయిన్‌ను(వైరస్) గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే తెలిపారు. దీని వల్లే కొవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు తారాస్థాయిలో పెరుగుతున్నాయని, అందుకు బలమైన ఆధారాలున్నాయన్నారు. ఈ న్యూ వైరస్‌పై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోందని వెల్లడించారు. 501.వీ2 అనే కొత్త రకం స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు, దీనిపై జన్యుశాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సౌతాఫ్రికాలో […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా వణికిపోతుండగా.. తాజాగా దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా స్ట్రెయిన్‌ను(వైరస్) గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే తెలిపారు. దీని వల్లే కొవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు తారాస్థాయిలో పెరుగుతున్నాయని, అందుకు బలమైన ఆధారాలున్నాయన్నారు. ఈ న్యూ వైరస్‌పై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోందని వెల్లడించారు. 501.వీ2 అనే కొత్త రకం స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు, దీనిపై జన్యుశాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సౌతాఫ్రికాలో ఇప్పటికే రికార్డు స్థాయిలో నమోదైన కొవిడ్ కేసులు 9 లక్షల మార్కును దాటగా.. ఈ మహమ్మారి కారణంగా 20 వేల మంది మృతి చెందారు. అయితే ఈ కొత్త వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జెల్వీ భరోసా ఇచ్చారు. మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆఫీసర్లు దక్షిణాఫ్రికా వైద్యులతో మాట్లాడుతున్నారని, ఈ స్ట్రెయిన్ విషయమై నిపుణులు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతున్నారని తెలిపారు.
Health Minister Dr Zweli Mkhize on Friday announced that a variant of the SARS-COV-2 Virus (COVID-19) – currently termed the ‘501.V2 Variant’ – has been identified by genomics scientists in South Africa.https://t.co/Gx3y45bbha
— Dr Zweli Mkhize (@DrZweliMkhize) December 18, 2020