కోహ్లి జట్టుపై గంగూలీ టీం గెలుస్తుంది: ఆకాశ్ చోప్రా
దిశ, స్పోర్ట్స్: ఇప్పటికిప్పుడు గంగూలీ, కోహ్లి సేనకు మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగితే దాదా జట్టే గెలుస్తుందని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా చెప్పారు. రెండు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే గంగూలీ జట్టే గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ ‘ఆకాశ్ వాణి’లో పలు విషయాలను వెల్లడించాడు. కోహ్లి నేతృత్వంలోని టీమ్ఇండియా 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనలో మినహా మరే ఇతర విదేశీ సిరీస్‌లు గెలవలేదని గుర్తు చేశాడు. గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా […]
దిశ, స్పోర్ట్స్: ఇప్పటికిప్పుడు గంగూలీ, కోహ్లి సేనకు మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగితే దాదా జట్టే గెలుస్తుందని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా చెప్పారు. రెండు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే గంగూలీ జట్టే గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ ‘ఆకాశ్ వాణి’లో పలు విషయాలను వెల్లడించాడు. కోహ్లి నేతృత్వంలోని టీమ్ఇండియా 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనలో మినహా మరే ఇతర విదేశీ సిరీస్‌లు గెలవలేదని గుర్తు చేశాడు. గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా మాత్రం పాకిస్తాన్, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు గెలిచిందని చెప్పాడు. ‘గంగూలీ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లి సిరీస్ డ్రా చేసింది. పాకిస్థాన్ వెళ్లి సిరీస్ గెలిచింది. భారత్‌లో ఆసీస్‌పై ఒక సిరీస్ గెలిచి ఒకటి ఓడింది. గంగూలీ జట్టు ఇంగ్లండ్‌లోనూ ఓ సిరీస్ డ్రా చేసింది. ఇది చాలా మంచి జట్టు. విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పించింది’ అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. అయితే, మొత్తం జయాపజయాలను పరిగణనలోకి తీసుకుంటే కోహ్లి సేననే మెరుగ్గా ఉందన్నాడు. కోహ్లి సేన 33 టెస్టుల్లో గెలిచి 12 ఓడగా, గంగూలీ జట్టు 21 గెలిచి 13 ఓడిందన్నారు.