గంగూలీ.. కోహ్లీ కెప్టెన్సీ విషయం నీకెందుకు.. మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో వన్డే కెప్టెన్సీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. విరాట్ కోహ్లీ, గంగూలీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కెప్టెన్సీ మార్పుపై గంగూలీ మాట్లాడుతూ వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే కోహ్లీని సెలెక్టర్లు తప్పించారని వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. తాజా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ స్పందిస్తూ.. గంగూలీకి అలా […]
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో వన్డే కెప్టెన్సీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. విరాట్ కోహ్లీ, గంగూలీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కెప్టెన్సీ మార్పుపై గంగూలీ మాట్లాడుతూ వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే కోహ్లీని సెలెక్టర్లు తప్పించారని వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు.
తాజా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ స్పందిస్తూ.. గంగూలీకి అలా మాట్లాడాల్సిన అవసరం, అధికారం కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు మాత్రమేనని.. కెప్టెన్సీ మార్పు గురించి ఏదైనా వివాదం తలెత్తితే.. అది సెలెక్షన్ కమిటీ చైర్మన్ చూసుకుంటాడని వివరణ ఇచ్చారు. కోహ్లీని కెప్టెన్‌గా ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే కారణాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ మాత్రమే వివరించాలని సూచించారు. కెప్టెన్‌ను ఎంపిక చేయడం లేదా తీసివేయడం అనేది సెలెక్షన్ కమిటీ చూసుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సెలెక్టర్ల నిర్ణయాన్ని కోహ్లీ కచ్చితంగా గౌరవించాల్సిందేనని అన్నారు.