ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నియమించబడ్డాడు. 2012 నుంచి 9 ఏళ్ల సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీని నియమిస్తూ క్రికెట్ గవర్నింగ్ బాడీ ఉత్తర్వలు జారీ చేసింది. ‘ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీకి ఆహ్వానం పలుకుతున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడిగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత మంచి క్రికెట్ పాలకుడుగా కూడా నిరూపించుకున్న ఆయన తప్పకుండా ఆ […]
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నియమించబడ్డాడు. 2012 నుంచి 9 ఏళ్ల సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీని నియమిస్తూ క్రికెట్ గవర్నింగ్ బాడీ ఉత్తర్వలు జారీ చేసింది. ‘ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీకి ఆహ్వానం పలుకుతున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడిగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత మంచి క్రికెట్ పాలకుడుగా కూడా నిరూపించుకున్న ఆయన తప్పకుండా ఆ పదవికి న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. గత 9 ఏళ్లుగా అద్భుతమైన పని తీరు కనబర్చిన అనిల్ కుంబ్లేకు ధన్యవాదములు. క్రికెట్‌లో డీఆర్ఎస్‌ను తీసుకొని రావడం దగ్గర నుంచి కోవిడ్ నిబంధనలు రూపొందించడం వరకు అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఆయన హయాంలో తీసుకున్నవే.’ అని ఐసీసీ చైర్మన్ గ్రెడ్ బార్క్‌లే అన్నారు.