ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం!

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటో సేవలను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 17న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో ప్రతిపాదించనున్నారు. ఈ సమావేశంలో ఫిట్‌మెంట్ కమిటీ సూచనలపై చర్చిస్తారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ఈ జీఎస్టీ సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం. దీనిలాగే, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను సైతం జీఎస్టీ కిందకు తెచ్చే ప్రతిపాదన ఉంది. […]

Update: 2021-09-15 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటో సేవలను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 17న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో ప్రతిపాదించనున్నారు. ఈ సమావేశంలో ఫిట్‌మెంట్ కమిటీ సూచనలపై చర్చిస్తారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ఈ జీఎస్టీ సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం. దీనిలాగే, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను సైతం జీఎస్టీ కిందకు తెచ్చే ప్రతిపాదన ఉంది. యాప్ సహా ఫుడ్ డెలివరీ, టేక్ అవే లాంటి అన్ని రకాల సేవలను జీఎస్టీ విధానంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి ఫిట్‌మెంట్ కమిటీ రెండు ప్రతిపాదనలను సూచించింది.

అవి, యాప్ ఆధారిత ఈ-కామర్స్ ఆపరేట్లర్లను డీండ్ సప్లయర్‌గా గుర్తిస్తూ ఇన్‌పుట్ క్రెడిట్ లేకుండా 5 శాతం, ఇన్‌పుట్ క్రెడిట్‌తో 18 శాతం పన్ను విధించవచ్చు. ఈ-కామర్స్ ఆపరేటర్ల నుంచి వినియోగదారునికి 5 శాతం పరిమిత ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ విధించవచ్చు. రెండో ప్రతిపాదనలో ఈ-కామర్స్ ఆపరేటర్లను అగ్రిగేటర్లుగా పన్ను రేట్లను నిర్ధారించడం. దీనివల్ల రెస్టారెంట్ అందించే అన్ని సేవలకు ఈ-కామర్స్ ఆపరేటర్లే జీఎస్టీని చెల్లించాలి. కానీ, ఇది రూ. 7,500 కంటే ఎక్కువ టారిఫ్ ఉన్న రెస్టారెంట్, హోటళ్లకు వర్తించే అవకాశంలేదు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జీఎస్టీ పరిధిలో లేని కారణంగా ఏడాదికి రూ. 2 వేల కోట్ల ఆదాయన్ని కోల్పోతున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని సైతం జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం.

అయితే, జొమాటో లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ట్యాక్స్ కలెక్టర్స్ అవుట్ సోర్స్‌గా రిజిస్టర్ చేసుకున్నాయి. కాబట్టి వాటికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News