ఇది నిందించుకోవాల్సిన టైం కాదు.. కలిసి రండి సాయం చేద్దాం : సోనుసూద్

దిశ, వెబ్‌డెస్క్ :  దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చాయి. దీంతో దేశ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మరికొందరైతే మళ్లీ దేశంలో లాక్‌డౌన్ పెడితే ఎలా బతకాలనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతంలో లాక్‌డౌన్ విధించిన సమయంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులతో పాటు ‘ఆపదలో ఉన్నాం.. మమ్మల్ని ఆదుకోండంటూ’ తనను సాయం కోరిన వారినే కాకుండా ఎంతో మందికి తన వంతు సాయం అందించి కరోనా సమయంలో రియల్ హీరోగా పేరు […]

Update: 2021-04-16 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చాయి. దీంతో దేశ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మరికొందరైతే మళ్లీ దేశంలో లాక్‌డౌన్ పెడితే ఎలా బతకాలనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతంలో లాక్‌డౌన్ విధించిన సమయంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులతో పాటు ‘ఆపదలో ఉన్నాం.. మమ్మల్ని ఆదుకోండంటూ’ తనను సాయం కోరిన వారినే కాకుండా ఎంతో మందికి తన వంతు సాయం అందించి కరోనా సమయంలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అనుకున్నదానికంటే రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుండటంతో చాలా మంది పేదలు సాయం కోసం మళ్లీ సోనుసూద్‌ తలుపు తడుతున్నారు. దీనిపై సోను శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

‘ఉదయం నుంచి తాను మొబైల్‌ను కింద పెట్టలేదని, ఎన్నో కాల్స్, మరెన్నో మెసేజెస్ దేశ వ్యాప్తంగా సాయం అందించాలని వస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్పత్రుల్లో పడకలు, మెడిసిన్స్, ఇంజెక్షన్లు అందుబాటులో లేవన్నారు. చాలా మందికి నేను సాయం లేకపోయాయని, ఐ యామ్ హెల్ప్ లెస్ అంటూ చెప్పాడు. ఈ పరిస్థితులను చూస్తుంటే చాలా భయంగా ఉందని, ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, మాస్కులు ధరించాలని, మిమ్మల్ని వైరస్ నుంచి మీరే కాపాడుకోవాలని సూచించారు.

చివరగా నేను అవసరం కోసం ఎదురుచూసే వారికి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇది ఒకరినొకరు నిందించుకోవాల్సిన సమయం కాదన్నారు. మనందరం కలిసి వస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవచ్చునని, పేదలకు మెడికల్ అవసరాలను తీర్చవచ్చునని పిలుపునిచ్చారు. కలిసి ప్రాణాలను కాపాడుదాం.. నేను మీ కోసమే ఉన్నానని సోను ట్వీట్ చేశారు.

Tags:    

Similar News