తండ్రి స్మరణలో సోనూ సూద్ .. హార్ట్ ఫెల్ట్ నోట్
తండ్రీ కొడుకుల అనుబంధం… అడుగడుగునా కొడుకును గెలిపించేందుకు తండ్రి చేసే త్యాగం. కొడుకు ఎదుగుదల కోసం నిరంతర శ్రామికుడిగా… కొడుకు సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో స్నేహితుడిగా … ఎల్లపుడు తోడు ఉంటాడు తండ్రి. అందుకే తండ్రే తన హీరో అంటాడు కొడుకు. అవును… నా నాన్న నా రోల్ మోడల్… నా హీరో అని చెబుతున్నాడు సోనూ సూద్. తండ్రి శక్తి సూద్ జయంతి పురస్కరించుకుని…ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు సోనూ. View this post on […]
తండ్రీ కొడుకుల అనుబంధం… అడుగడుగునా కొడుకును గెలిపించేందుకు తండ్రి చేసే త్యాగం. కొడుకు ఎదుగుదల కోసం నిరంతర శ్రామికుడిగా… కొడుకు సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో స్నేహితుడిగా … ఎల్లపుడు తోడు ఉంటాడు తండ్రి. అందుకే తండ్రే తన హీరో అంటాడు కొడుకు. అవును… నా నాన్న నా రోల్ మోడల్… నా హీరో అని చెబుతున్నాడు సోనూ సూద్. తండ్రి శక్తి సూద్ జయంతి పురస్కరించుకుని…ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు సోనూ.
” హ్యాపీ బర్త్ డే డాడీ. మీకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలపని మీ ఐదో పుట్టినరోజు ఇది. మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నానో తెలిపేందుకు ఈ ప్రపంచంలో పదాలు కూడా లేవు నాన్న. మీరు నాకు దూరమై రోజులు గడుస్తున్నా… మీతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. మీరు నన్ను స్కూటీ మీద స్కూల్ లో దింపే రోజుల నుంచి… ఇంజనీర్ అయినప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిన రోజు వరకు ప్రతిదీ గుర్తుంది. అప్పుడు మీ పాకెట్ లో ఉన్న డబ్బు మొత్తం నాకిచ్చేసి… రూపాయి కూడా చేతిలో లేకుండా ఢిల్లీ నుంచి మోగ వరకు మీరు తిరుగు ప్రయాణం చేసింది కూడా గుర్తుంది. మీరు నాకు చాలా ఇష్టం డాడీ. నాకు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉంది.
మీ పుట్టినరోజు సందర్భంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం మీ పేరు మీద ” శక్తి అన్నదానం ” స్వద్చంధ సంస్థ ప్రారంభించి వేల మంది ఆకలి తీర్చడమే. మిమ్మల్ని మళ్లీ చూసే వరకు మీ అడుగుజాడల్లో నడుస్తాను నాన్న ” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సోనూ. ఈ సందర్భంగా తన పుట్టినరోజున తనకు తండ్రి రాసిన లెటర్ ను అభిమానులతో పంచుకున్నాడు సోనూ.
Tags : Sonu Sood, Bollywood, Tollywood, Shakti Sood, Dad, Birth anniversary