సోనూ చొరవ.. 349 మంది స్వదేశానికి

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో.. సోనూ సూద్ కూడా తన సేవ వ్యాప్తిని పెంచుతున్నాడు. ఆపదలో ఉన్న వారి ఆచూకీ తెలిస్తే చాలు వారి సమస్యను క్షణాల్లో తీరుస్తున్నాడు. కరోనా కాలంలో సోనూ సూద్ వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడు. ఒక్క మేసేజ్ చేస్తే వెంటనే వారి అవసరాన్ని తీర్చి బాధితులకు భగవంతుడయ్యాడు. లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవతో రీల్ విలన్ కాస్తా రియల్ హీరోగా మారాడు. దీంతో సోనూ సూద్ […]

Update: 2020-07-25 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో.. సోనూ సూద్ కూడా తన సేవ వ్యాప్తిని పెంచుతున్నాడు. ఆపదలో ఉన్న వారి ఆచూకీ తెలిస్తే చాలు వారి సమస్యను క్షణాల్లో తీరుస్తున్నాడు. కరోనా కాలంలో సోనూ సూద్ వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడు. ఒక్క మేసేజ్ చేస్తే వెంటనే వారి అవసరాన్ని తీర్చి బాధితులకు భగవంతుడయ్యాడు. లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవతో రీల్ విలన్ కాస్తా రియల్ హీరోగా మారాడు. దీంతో సోనూ సూద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు చేయలేని పని ఓ సెలబ్రిటీ చేశాడని ప్రజానీకం కొనియాడింది.

కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షలతో తీవ్ర ఇక్కట్ల పాలైన వారిని స్వస్థలాలకు స్వచ్ఛందగా చేరుస్తున్న సోనూ సూద్‌ స్పైస్ జెట్ విమానంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాల్లో చిక్కుకుపోయిన వసల కూలీలను ప్రత్యేక విమానాల్లో వైజాగ్ చేర్చారు.

సౌదీ ఆరేబియా నుంచి వచ్చిన విమానంలో 170 మంది వలస కూలీలు ఉంటే… కిర్గిజిస్తాన్ నుంచి వచ్చిన విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేసిన ప్రభుత్వం వారి వారి సొంత జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు చేర్చింది. క్వారంటైన్ ముగిసిన తరువాత వారు ఆరోగ్యవంతులైతే ఇళ్లకు పంపనుంది. కాగా, సోనూ సూద్ గొప్పమనసు కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వారితో పాటు, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు కూడా స్వస్థలాలకు చేరుకుతున్నారు. సోనూ సూద్ చేసిన పనిని నెటిజన్లు వేనోళ్ల పొగుడుతున్నారు.

Tags:    

Similar News