ఒంటరి మహిళకు ఇల్లు సాయం చేసిన సోనూ
అస్సాంలో సంభవించిన వరదల గురించి అందరికీ తెలిసిందే. ఈ వరదల కారణంగా జల్‌పైగురిలోని ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమె భర్త ఎప్పుడో చనిపోగా.. తన ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలోనే నివాసముంటోంది. ఇప్పుడు ఆ గుడిసె కూడా ధ్వంసం కావడంతో చెప్పరాని కష్టాలు పడుతోంది. కనీసం పిల్లలకు తిండి పెట్టడానికి కూడా ఆమెకు వీలు కావడం లేదు. ఈ క్రమంలో ‘సోనాల్ సింఘ్’ అనే మహిళ.. వరదల్లో దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి […]
అస్సాంలో సంభవించిన వరదల గురించి అందరికీ తెలిసిందే. ఈ వరదల కారణంగా జల్‌పైగురిలోని ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమె భర్త ఎప్పుడో చనిపోగా.. తన ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలోనే నివాసముంటోంది. ఇప్పుడు ఆ గుడిసె కూడా ధ్వంసం కావడంతో చెప్పరాని కష్టాలు పడుతోంది. కనీసం పిల్లలకు తిండి పెట్టడానికి కూడా ఆమెకు వీలు కావడం లేదు. ఈ క్రమంలో ‘సోనాల్ సింఘ్’ అనే మహిళ.. వరదల్లో దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేసింది. దాంతో అది కాస్త మన రియల్ హీరో, దాతృత్వంలో శిబి చక్రవర్తి లాంటి సోనూసూద్ కంటపడింది. సాయం కావాలనే పిలుపు వినిపిస్తే చాలు.. నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందిస్తున్న ఈ రీల్ విలన్.. వెంటనే ఆమెకు కొత్త ఇల్లు ఇస్తున్నానని ప్రకటించాడు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.