Mr. India సీక్వెల్‌పై సోనమ్ ఫైర్
మిస్టర్ ఇండియా.. అనిల్ కపూర్, శ్రీదేవి, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. శేఖర్ కపూర్ దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. మెయిన్ లీడ్‌లో రణ్ బీర్ కపూర్‌ను ఆల్మోస్ట్ కన్‌ఫాం చేసిన డైరెక్టర్… అమ్రిష్ పురి చేసిన మొగాంబి క్యారెక్టర్ […]
మిస్టర్ ఇండియా.. అనిల్ కపూర్, శ్రీదేవి, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. శేఖర్ కపూర్ దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. మెయిన్ లీడ్‌లో రణ్ బీర్ కపూర్‌ను ఆల్మోస్ట్ కన్‌ఫాం చేసిన డైరెక్టర్… అమ్రిష్ పురి చేసిన మొగాంబి క్యారెక్టర్ కోసం షారుక్ ఖాన్‌ను సంప్రదించగా రిజెక్ట్ చేశారు.
అయితే మిస్టర్ ఇండియా సీక్వెల్ ప్లాన్‌పై అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మండిపడ్డారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన తన తండ్రి, డైరెక్టర్ శేఖర్ కపూర్ అనుమతి లేకుండా సీక్వెల్ ఎలా తీస్తారని ప్రశ్నించారు. అలీ అబ్బాస్ ట్వీట్ చూశాకే సినిమా సీక్వెల్ చేస్తున్నారని తెలిసిందని… ఇది నిజంగా శోచనీయమన్నారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఎందరో హార్డ్ వర్క్ చేశారని… ఆ చిత్రాన్ని ప్రేమించారని… వాళ్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రికి ఈ సినిమా చాలా సెంటిమెంటల్ అన్న సోనమ్, అలాంటి చిత్రానికి సీక్వెల్ చేసేటప్పుడు వారి నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఎంతో మంది శ్రమిస్తే తప్ప బాక్సాఫీస్ వద్ద అంత భారీ కలెక్షన్లు రావని, వారికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సీక్వెల్ ప్లాన్ చేసిన వారికి ఉంటుందంటూ క్లాస్ పీకారు.
అలీ అబ్బాస్ ట్వీట్‌పై మిస్టర్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా స్పందించారు. మిస్టర్ ఇండియా పేరుతో సినిమాను మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మిస్టర్ ఇండియా సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్లైతే తమను తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్ కోసం తమ సినిమా టైటిల్ వాడితే పట్టించుకోమన్న శేఖర్ కపూర్… కథను తీసుకుంటే మాత్రం తమను సంప్రదించాల్సిందేనని తెలిపారు.
FYI pic.twitter.com/YRmrny8VeW
— Sonam K Ahuja (@sonamakapoor) February 22, 2020