కరోనాపై సోనం కపూర్ మాట ఇదీ..

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో బాగున్నాయని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్‌పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతో పనిచేస్తున్నారని… అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ విజృంభించడంతో.. లండన్ వెళ్లినా.. సోనం కపూర్‌.. తన భర్త ఆనంద్‌ అహుజాలు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మంగళవారం ఢిల్లీకి వచ్చారు. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్క్రీనింగ్‌ నిర్వహించడంతో […]

Update: 2020-03-18 07:30 GMT

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో బాగున్నాయని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్‌పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతో పనిచేస్తున్నారని… అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ విజృంభించడంతో.. లండన్ వెళ్లినా.. సోనం కపూర్‌.. తన భర్త ఆనంద్‌ అహుజాలు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మంగళవారం ఢిల్లీకి వచ్చారు. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్క్రీనింగ్‌ నిర్వహించడంతో పాటుగా… గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సోనమ్ కఫూర్ , ఆనంద్ ఆహుజాలు లండన్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. తమకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా.. కరోనా కట్టడి కోసం తమకు తాముగా హౌజ్ అరెస్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోనం తన అనుభవాలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘‘మేం లండన్‌ నుంచి బయల్దేరుతున్నప్పుడు స్క్రీనింగ్‌ చేయలేదు. ఈ విషయం తెలిసి షాకయ్యాం. అయితే భారత్‌కు చేరుకోగానే… మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్టు అధికారులు ఫారమ్‌లో నింపమన్నారు. మేం చెప్పిన విషయాలు నిజమా? కాదా? అని చెక్‌ చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారులు, అక్కడి సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. అంతేకాదు వైద్యులు, అధికారులు చెప్పిన మాటలు వినాలని.. వైద్య పరీక్షల నిమిత్తం వారికి సహకరించాలని సోనం విజ్ఞప్తి చేశారు.

tags : sonam kapoor, anand ahuja, carinna virus, covid -19, airport, delhi, london, indian govt,

Tags:    

Similar News