'అ..లాంటి కోరికలు' నాకు కూడా ఉన్నాయి: హీరోయిన్

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహ బంధం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఈ భామ తన మొదటి రిలేషన్‌షిప్ అనుభవాలను పంచుకుంటూ.. తను 21 ఇయర్స్ ఉన్నపుడే ఒకరితో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ చేశానని, ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండటంతో తమ స్నేహం ఐదేళ్లపాటు కొనసాగిందని చెప్పింది. కానీ, కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోవాల్సి రావడంతో చాలా ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది. ఈ మేరకు […]

Update: 2021-10-02 05:15 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహ బంధం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఈ భామ తన మొదటి రిలేషన్‌షిప్ అనుభవాలను పంచుకుంటూ.. తను 21 ఇయర్స్ ఉన్నపుడే ఒకరితో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ చేశానని, ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండటంతో తమ స్నేహం ఐదేళ్లపాటు కొనసాగిందని చెప్పింది. కానీ, కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోవాల్సి రావడంతో చాలా ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది. ఈ మేరకు కొందరి వ్యక్తిత్వాలకు సంబంధించి తెలిపిన సోనాక్షి.. ‘ప్రతి ఒక్కరికీ తన సొంత ఇష్టాలు, కోరికలు ఉంటాయి. వాటిని ఇద్దరూ అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసుండేలా ముందుకు సాగడం చాలా ముఖ్యం. పెళ్లికి ముందు మిమ్మల్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తినే ఎంచుకోవాలి. లేదా కొన్నిసార్లు అభిప్రాయభేదాలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నాకు జరిగిన అనుభవం తర్వాత చాలామంది కొత్త వ్యక్తులను కలిశాను. వారి నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మీరు కూడా జీవితంలో ఎంతోమందిని కలుస్తుంటారు. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ముఖ్యం’ అని వివరించింది ఈ బ్యూటీ.

Tags:    

Similar News