తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
దిశ, చార్మినార్: తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయిన కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో ఒక రోజు వ్యవధిలో తండ్రి కొడుకులు మృతిచెందడంతో జహనుమాలో విషాదచాయలు అలుముకున్నాయి. ఫలక్నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. జహనుమాకు చెందిన మీర్ అలామా ఆలీ(70)కు ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు దుబాయ్లో ఉంటుండగా చిన్న కుమారుడు మీర్ ఉస్మాన్ ఆలీ(39) మాత్రం తండ్రితో పాటే కలిసి ఉంటున్నారు. […]
దిశ, చార్మినార్: తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయిన కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో ఒక రోజు వ్యవధిలో తండ్రి కొడుకులు మృతిచెందడంతో జహనుమాలో విషాదచాయలు అలుముకున్నాయి. ఫలక్నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. జహనుమాకు చెందిన మీర్ అలామా ఆలీ(70)కు ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు దుబాయ్లో ఉంటుండగా చిన్న కుమారుడు మీర్ ఉస్మాన్ ఆలీ(39) మాత్రం తండ్రితో పాటే కలిసి ఉంటున్నారు.
మీర్ ఉస్మాన్ ఆలీకి భార్య, ముగ్గురు సంతానం . వృత్తిరీత్యా మెకానిక్ అయిన మీర్ ఉస్మాన్ ఆలీ తండ్రిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాడు. తండ్రి మీర్ అలామా ఆలీ ఈ నెల 28వ తేదీన అకస్మాత్తుగా మృతిచెందాడు. దీంతో కొడుకు మీర్ ఉస్మాన్ ఆలీ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. తండ్రి మీర్ అలామా అంత్యక్రియలు 29వ తేదీన మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చాక కుమారుడు ఉస్మాన్ ఆలీ తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.
రాత్రి 10గంటల వరకు తిరిగి బయటికి రాలేదు. సోదరుడు తన బట్టలు తీసుకోవడానికి గది వద్దకు వెళ్లగా ఎంతసేపు తలుపులు బాదినా తెరవకపోవడంతో అద్దాల కిటికీ బద్దలు కొట్టి చూడగా మీర్ ఉస్మాన్ ఆలీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. వెంటనే ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకుని ఘటనాస్థలికి చేరుకున్నారు. శవపంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.