డబ్బులివ్వలేదని.. కన్నతల్లిని రోకలితో మోది
దిశ, దేవరకొండ: తాగేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో ఓ యువకుడు కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ పరిధిలోని పీఏ పల్లి మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకివెళితే…పెద్ద ఆడిషర్లపల్లి మండలం బాలాజీనగర్ కు చెందిన మెగావత్ బుజ్జి (48)కు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడైన మున్నా(21) మద్యానికి , పేకాటకు బానిసై జులాయిగా తిరిగేవాడు. తన అక్కకు కళ్యాణలక్ష్మి డబ్బులు రాగా ఇంట్లో నుంచి రోజు కొంత తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలోనే […]
దిశ, దేవరకొండ: తాగేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో ఓ యువకుడు కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ పరిధిలోని పీఏ పల్లి మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకివెళితే…పెద్ద ఆడిషర్లపల్లి మండలం బాలాజీనగర్ కు చెందిన మెగావత్ బుజ్జి (48)కు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడైన మున్నా(21) మద్యానికి , పేకాటకు బానిసై జులాయిగా తిరిగేవాడు. తన అక్కకు కళ్యాణలక్ష్మి డబ్బులు రాగా ఇంట్లో నుంచి రోజు కొంత తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలోనే సోమవారం డబ్బులివ్వాలని అడగ్గా తల్లి అందుకు విభేదించింది. దీంతో కోపోద్రిక్తుడైన మున్నా పక్కనే ఉన్న రోకలితో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.