అజయ్ దేవగన్‌ను చితకబాదిన రైతులు.. వీడియో వైరల్!

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఢిల్లీలో పబ్ బయట గొడవపడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. రైతుల నిరసనపై అజయ్ అన్నదాతలకు మద్దతివ్వలేదనే తనపై దాడి చేశారని, కొంత మంది తనను కొట్టారని మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే వీడియోలో వ్యక్తి ముఖం సరిగ్గా కనిపించనప్పటికీ..తను అజయ్ దేవగన్ అని మీడియా కన్‌ఫర్మ్ చేయడం సరికాదన్నాడు అజయ్ స్పోక్స్ పర్సన్. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి దేవగన్ కాదని క్లారిటీ ఇచ్చాడు. […]

Update: 2021-03-29 06:59 GMT
అజయ్ దేవగన్‌ను చితకబాదిన రైతులు.. వీడియో వైరల్!
  • whatsapp icon

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఢిల్లీలో పబ్ బయట గొడవపడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. రైతుల నిరసనపై అజయ్ అన్నదాతలకు మద్దతివ్వలేదనే తనపై దాడి చేశారని, కొంత మంది తనను కొట్టారని మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే వీడియోలో వ్యక్తి ముఖం సరిగ్గా కనిపించనప్పటికీ..తను అజయ్ దేవగన్ అని మీడియా కన్‌ఫర్మ్ చేయడం సరికాదన్నాడు అజయ్ స్పోక్స్ పర్సన్.

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి దేవగన్ కాదని క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా న్యూస్ ప్రజెంట్ చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని, అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని కోరాడు. ‘మైదాన్, మేడే, గంగూబాయి కతియావాడి’ షూటింగ్‌లో తమ హీరో బిజీగా ఉన్నారని, 14 నెలల్లో తను ఢిల్లీకే రాలేదని వివరించాడు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలకు మద్దతు ఇచ్చినందుకు గానురాజ్‌దీప్ రమేశ్ సింగ్‌ అనే వ్యక్తి ఈ నెల ప్రారంభంలో ముంబై ఫిల్మ్‌సిటీకి వెళ్తున్న అజయ్ కారును ఆపాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 504, 506 (ii) కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Tags:    

Similar News