Prabhas: ప్రభాస్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారా.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2025-03-31 11:46 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి(Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రానుంది. దీంతో పాటు ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. స్పిరిట్, ఫౌజి, కల్కి-2, సలార్-2 వంటి మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్ల నుంచి ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో సార్లు వచ్చినప్పటికీ వీరిద్దరు స్పందించలేదు. అయితే ఇటీవల ప్రభాస్ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి వార్తలు రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీమ్ స్పందించి అవన్నీ పుకార్ల అని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రభాస్, అనుష్కకు పెళ్లై ముగ్గురు పిల్లలు పుట్టినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇందులో ఇద్దరు బాబులు, ఒక పాపతో కలిసి స్వీటీ, డార్లింగ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒక్కసారిగా వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అవి ఏఐతో క్రియేట్ చేసినవని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News