Diabetes : షుగర్ వల్ల నోరు కట్టేసుకొంటున్నారా..? అయితే ఇవి తినండి

దిశ, వెబ్ డెస్క్: మధుమేహం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. ఏ వయసు ఉన్నవారైనా మధుమేహం బారిన పడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గినప్పుడు షుగర్ వస్తుంది. ఇలాంటి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆహరం విషయంలో… డయాబెటిస్ ఎటాక్ అయ్యినవారు తిండి విషయంలో తమ నోరును కట్టేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్స్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కు వీరు చాలా దూరంగా ఉంటారు. అయితే వీటితో పాటు […]

Update: 2021-04-30 00:39 GMT

దిశ, వెబ్ డెస్క్: మధుమేహం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. ఏ వయసు ఉన్నవారైనా మధుమేహం బారిన పడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గినప్పుడు షుగర్ వస్తుంది. ఇలాంటి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆహరం విషయంలో… డయాబెటిస్ ఎటాక్ అయ్యినవారు తిండి విషయంలో తమ నోరును కట్టేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్స్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కు వీరు చాలా దూరంగా ఉంటారు. అయితే వీటితో పాటు షుగర్ ఉన్నవారు పండ్లకు కూడా దూరంగా ఉంటారు. ఏ పండు తింటే ఏం సమస్య వస్తుందో అని సందేహిస్తారు. అయితే డయాబెటిస్ ఉన్న‌ప్ప‌టికీ కొన్ని పండ్ల‌ను మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు నిర‌భ్యంత‌రంగా తినొచ్చు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ (Apple)

రోజుకో ఆపిల్ ని తినడం వలన డాక్టర్ తో అవసరముండదు అని వైద్యులే తెలుపుతుంటారు. అందరితో పాటు షుగర్ ఉన్నవారు కూడా రోజుకో ఆపిల్ తినవచ్చు. ఇందులో చక్కెర ను తగ్గించే పెక్టిన్ అనే ఒక ర‌సాయనం ఉంటుంది. దీనివలన షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకూండా ఆపిల్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు విట‌మిన్లు, అధికంగా ఉంటాయి. అందుకే ఆపిల్ ని డయాబెటిస్ ఉన్నవారు నిర‌భ్యంత‌రంగా తినొచ్చు.

ఆరెంజ్ (Orange)

ఆరెంజ్ తినడం వలన జలుబు వస్తుంది.. అందులో ఎక్కువ స్వీట్ ఉంటుంది అని అనుకోని వీటిని తినడం పక్కన పెట్టేస్తారు. అయితే ఆరెంజ్ లో జీఐ త‌క్కువ‌గా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్‌, బీటాకెరోటిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి దోహదపడతాయి.

కివీ పండు (Kiwi)

కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కాబ‌ట్టి కివీస్‌ తిన‌డం వ‌ల్ల డయాబెటిస్ తీవ్ర‌త త‌గ్గుతుంది. వీటిని కూడా డయాబెటిస్ పేషేంట్స్ చక్కగా తినొచ్చు.

జామ (Guava)

జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి సహాయపడతాయి.

 

బెర్రీస్ (Berry)

బెర్రీస్ లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి డయాబెటిక్ పేషంట్స్ కు తప్పనిసరిగా అవసరం అవుతాయి. రక్తంలోకి నిధానంగా గ్లూకోజ్ ను రిలీజ్ చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బెర్రీస్ తినడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

బొప్పాయి (Papaya)

మధుమేహాన్ని నియంత్రించాలనుకునేవారు ఖచ్చితంగా బొప్పాయి తినాలి. ఇందులో విటమిన్ ఎ, కే, ఇ, సి విటమిన్స్‌తో పాటు బి కాంప్లెక్సులు బీ1, బీ 2, బీ 3, బీ 5 మరియు బీ 9 వంటి పోషకాలు ఉంటాయి. వీటితో పాటు పొపైన్, చిమ్పోపాన్ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.

వీటితో పాటు రేగి పళ్లు, నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చకాయ లాంటి వాటిని కూడా తినొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు పండ్లను రోజువారీ ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకొని డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.

Tags:    

Similar News