భూమిని తాకిన సౌర తుఫాన్

దిశ, ఫీచర్స్: ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందని, దీని వల్ల కొంత నష్టం వాటిల్లవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సౌర తుఫాను బుధ‌వారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) వెల్లడించింది. బుధవారం రాత్రి సంభవించిన సౌర తుఫాను కారణంగా బలహీనమైన పవర్ గ్రిడ్‌లో హెచ్చుతగ్గులు సంభవించాయని ఎన్ఓఏఏ […]

Update: 2021-07-15 02:39 GMT

దిశ, ఫీచర్స్: ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందని, దీని వల్ల కొంత నష్టం వాటిల్లవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సౌర తుఫాను బుధ‌వారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) వెల్లడించింది.

బుధవారం రాత్రి సంభవించిన సౌర తుఫాను కారణంగా బలహీనమైన పవర్ గ్రిడ్‌లో హెచ్చుతగ్గులు సంభవించాయని ఎన్ఓఏఏ తెలిపింది. భూమి ఉపరితలంపై ఎవరికి ప్రమాదకరం కానప్పటికీ, సౌర తుఫానులు జియోమాగ్నెటిక్ వేవ్స్ ప‌వ‌ర్ గ్రిడ్స్‌‌తో పాటు, రేడియో కమ్యూనికేషన్స్‌ను పనిచేయకుండా చేయగలవు. దీని జియోమాగ్నెటిక్ కే-ఇండెక్స్ 4గా ఉంది. కె- ఇండెక్స్ భౌగోళిక అయస్కాంత తుఫానుల పరిమాణాన్ని, తీవ్రతను తెలిపే సూచిక కాగా, లెవల్ 4 దాని స్థాయిని వివరించడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం దాని విలువ 4 సూచిస్తుండటంతో స్వల్పమైన ప్రభావం చూపించిందని తెలిపారు. అలాగే సౌర తుఫాను కారణంగా బలహీనమైన పవర్ గ్రిడ్ హెచ్చుతగ్గులు సంభవించాయని వెల్లడించారు.

2017లో వచ్చిన సౌర తుఫాను రేడియో క‌మ్యూనికేష‌న్లను దెబ్బతీశాయి. 2015లో ఈశాన్య అమెరికాలో జీపీఎస్ వ్యవ‌స్థకు ఇబ్బంది క‌లిగించాయి. 1989లో కెన‌డాలోని క్యూబెక్ మీదుగా వెళ్లిన ఓ సౌర తుఫాను అక్కడి విద్యుత్ వ్యవస్థకు 9 గంట‌ల పాటు అంత‌రాయం క‌లిగించిందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News