సాఫ్ట్‌వే‌ర్ ఉద్యోగిని ఆత్మహత్య.. వేధింపులే కారణమా?

దిశ, కామారెడ్డి: ప్రేమ వివాహం చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. బెంగళూరులోని తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. అల్లుడే తమ కూతురిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన శరణ్య (25) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన, తన క్లాస్‌మేట్ రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరూ కలిసి […]

Update: 2020-08-07 07:32 GMT

దిశ, కామారెడ్డి: ప్రేమ వివాహం చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. బెంగళూరులోని తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. అల్లుడే తమ కూతురిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన శరణ్య (25) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన, తన క్లాస్‌మేట్ రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరూ కలిసి బెంగళూరులో నివాసముంటున్నారు. కాగా, వివాహమైన కొన్నాళ్ల తర్వాత రోహిత్‌ నిత్యం మద్యం సేవిస్తూ.. ఆమెను కొట్టడం ప్రారంభించాడు.

భర్త వేధింపులు తాళలేక శరణ్య ఇటీవలే తల్లి గారింటికి వచ్చింది. దీంతో కామారెడ్డికి వచ్చిన రోహిత్‌.. ఇకపై తన భార్యను కష్టపెట్టనని, వేధింపులకు గురిచేయనని పెద్దల సమక్షంలో అంగీకరించి 3నెలల కిందటే ఆమెను మళ్లీ కాపురానికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది. అల్లుడే తమ కూతురిని చంపేసి ఉంటాడని లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటాడని ఆమె తల్లి మాధవి ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News