ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్.. దాని కోసం ఉరేసుకుని ఆత్మహత్య
దిశప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడు ఆకుల రాజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన అతను పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైనట్టు […]
దిశప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడు ఆకుల రాజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల స్వగ్రామానికి వచ్చిన అతను పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులు కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితకుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.