వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టి చనిపోయారు?: వైరల్ మెసేజ్
సామాజిక మాధ్యమాల్లో చిత్రవిచిత్రమైన మెసేజ్‌లు వైరల్‌గా మారుతుంటాయి. కరోనా నేపథ్యంలో అల్లం, వెల్లుళ్లి నీరు తాగండని ఒక మేసేజ్, కరోనాకి గోమూత్రమే మందంటూ మరోక మెసేజ్‌లు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని సోషల్ మీడియా సర్కిల్‌లో ఒక మెసేజ్ వైరల్‌గా మారింది. కరోనా వస్తుందని కొన్ని వందల సంవత్సరాల క్రితమే నుడివిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరోసారి పుట్టి కరోనాకి వైద్యాన్ని చెప్పారంటూ వాట్స్‌యాప్‌తో పాటు ఫేస్‌బుక్‌లలో వైరల్‌గా మారింది. ఈ […]
సామాజిక మాధ్యమాల్లో చిత్రవిచిత్రమైన మెసేజ్‌లు వైరల్‌గా మారుతుంటాయి. కరోనా నేపథ్యంలో అల్లం, వెల్లుళ్లి నీరు తాగండని ఒక మేసేజ్, కరోనాకి గోమూత్రమే మందంటూ మరోక మెసేజ్‌లు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని సోషల్ మీడియా సర్కిల్‌లో ఒక మెసేజ్ వైరల్‌గా మారింది.
కరోనా వస్తుందని కొన్ని వందల సంవత్సరాల క్రితమే నుడివిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరోసారి పుట్టి కరోనాకి వైద్యాన్ని చెప్పారంటూ వాట్స్‌యాప్‌తో పాటు ఫేస్‌బుక్‌లలో వైరల్‌గా మారింది. ఈ మెసేజ్ ఎక్కడ పుట్టిందో కానీ బ్రహ్మేంద్ర స్వామి మఠం వారు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే…
బనగానపల్లెలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒక భక్తుని శరీరం లోనికి వచ్చి “నేను కాలజ్ఞానం లో చెప్పిన విధంగా “కరోనా వైరస్” విజృంభిస్తోంది. ఆ మహమ్మారికి విరుగుడు కూడా నేనే చెబుతున్నాను. కొద్దిగా అల్లం, మిరియాలు, బెల్లంలను సమపాళ్లలో తీసుకుని, మూడింటిని దంచి, నీళ్లలో కషాయం లాగ బాగా మరిగించి, గ్లాసు నిండా తాగండి”అని చెప్పి ఆ భక్తుడు చనిపోయాడు. ఈ కషాయం ఆ భక్తుడి మృతదేహాన్ని దహనం చేసేంత లోపలే మనం స్వీకరించాలని, అలా చేస్తే కరోనా నుంచి విముక్తి కలుగుతుందని కూడా సెలవిచ్చాడు. దయచేసి మూఢనమ్మకం అనుకోకుండా అందరూ చేస్తారని నా మనవి అంటూ ఉందామెసేజ్…
ఈ మెసేజ్‌ని చూసిన వారు దీనిని పుట్టించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైరస్‌ను చంపేందుకు దేవుడే దిగి వస్తాడా? అని ఆస్తికులు… కరోనాను అడ్డం పెట్టుకుని భక్తి ముసుగులో ఎంతమందిని మోసం చేస్తారు? అంటూ హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల నమ్మకాలతో ఆడుకోవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags : social media, massage, veerabrahmendra swamy, corona