ఏ కరోనా టీకాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు: కిషన్ రెడ్డి
దిశ,వెబ్ డెస్క్: ఇప్పటి వరకు ఏ కరోనా టీకాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ల్యాబ్ ఇమ్యూనో బూస్టర్ ఉత్పత్తిని ఆయన శనివారం ప్రారంభించారు. సరైన టీకా ఎంపిక కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని తెలిపారు. భారత్ బయోటెక్, సీరం సంస్థల టీకాల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని చెప్పారు. ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల కంటే మన టీకాపైనే ప్రపంచానికి ఆసక్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. భారత్‌లో ట్రయల్స్‌లో ఉన్న టీకాలు […]
దిశ,వెబ్ డెస్క్: ఇప్పటి వరకు ఏ కరోనా టీకాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ల్యాబ్ ఇమ్యూనో బూస్టర్ ఉత్పత్తిని ఆయన శనివారం ప్రారంభించారు. సరైన టీకా ఎంపిక కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని తెలిపారు. భారత్ బయోటెక్, సీరం సంస్థల టీకాల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని చెప్పారు. ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల కంటే మన టీకాపైనే ప్రపంచానికి ఆసక్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. భారత్‌లో ట్రయల్స్‌లో ఉన్న టీకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు.