యూరిన్ కోసం వెళితే.. అక్కడ కాటేసిన పాము!

దిశ, వెబ్‌డెస్క్ : అర్జంట్‌గా టాయిలెట్ వస్తుందని వెళ్లిన ఓ యువకుడికి ఎవ్వరూ ఊహించని ప్రమాదం ఎదురైంది. యూరిన్ చేస్తున్నప్పుడు టాయిలెట్ కమోడ్‌లో దాగియున్న పాము అతని పురుషాంగంపై కాటేసింది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ నొప్పి భరించలేక లబోదిబో మంటూ బయటకు పరుగులు తీశాడు. వివరాల్లోకివెళితే.. థాయ్‌ల్యాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో సిరపోప్ మసుకారత్ (18) అనే యువకుడు నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జంట్‌గా టాయిలెట్ వస్తుందని వెళ్లి మూత్ర విసర్జన చేస్తుండగా, […]

Update: 2020-09-14 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అర్జంట్‌గా టాయిలెట్ వస్తుందని వెళ్లిన ఓ యువకుడికి ఎవ్వరూ ఊహించని ప్రమాదం ఎదురైంది. యూరిన్ చేస్తున్నప్పుడు టాయిలెట్ కమోడ్‌లో దాగియున్న పాము అతని పురుషాంగంపై కాటేసింది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ నొప్పి భరించలేక లబోదిబో మంటూ బయటకు పరుగులు తీశాడు.

వివరాల్లోకివెళితే.. థాయ్‌ల్యాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో సిరపోప్ మసుకారత్ (18) అనే యువకుడు నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జంట్‌గా టాయిలెట్ వస్తుందని వెళ్లి మూత్ర విసర్జన చేస్తుండగా, కమోడ్‌లో దాగి ఉన్న పాము అతడి పురుషాంగంపై కాటేసింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో పాటు అతని పురుషాంగం వాచిపోయింది. అలాగే దానిని చేతబట్టుకుని పరుగు తీస్తూ వచ్చి, అసలు విషయం అతని సోదరుడికి చెప్పాడు. అతను వెంటనే కారు తీసి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పాటు కాటుకు గురైన యువకుడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు.

పరీక్షల అనంతరం, తనను కాటేసింది విషపు నాగు కాదని.. బురద జాతికి చెందిన పాముగా డాక్టర్లు వివరించారు. అయితే సదరు పాము విషం ప్రమాదకరమైనది కాదని, అతడి పురుషాంగానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదని చెప్పి చిన్న పాటి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించివేశారు. ఇదిలాఉండగా, తనకు జరిగిన విషయాన్ని సదరు యువకుడు సోషల్ మీడియా ద్వారా తన స్నేహితులతో పంచుకోవడంతో వారు కాస్త దానిని వైరల్ చేశారు.

Tags:    

Similar News