బిగ్‌బాష్ లీగ్ ఆడనున్న స్మృతి, దీప్తి

దిశ, స్పోర్ట్స్: భారత మహిళ క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, దీప్తి శర్మ ఈ ఏడాది ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్)లో ఆడనున్నారు. అక్టోబర్ 14 నుంచి డబ్ల్యూబీబీఎలో డిఫెండిండ్ చాంపియన్ సిడ్నీ థండర్స్ తరపున ఆడనున్నట్లు తెలుస్తున్నది. టీమ్ ఇండియా మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఆ పర్యటన ముగిసిన తర్వాత జట్టంతా తిరిగి ఇండియాకు వచ్చినా వీరిద్దరూ అక్కడే ఉండనున్నారు. డబ్ల్యూబీబీఎల్ ముగిసిన తర్వాతే వారిద్దరు తిరిగి రానున్నారు. స్మృతి […]

Update: 2021-09-26 11:26 GMT

దిశ, స్పోర్ట్స్: భారత మహిళ క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, దీప్తి శర్మ ఈ ఏడాది ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్)లో ఆడనున్నారు. అక్టోబర్ 14 నుంచి డబ్ల్యూబీబీఎలో డిఫెండిండ్ చాంపియన్ సిడ్నీ థండర్స్ తరపున ఆడనున్నట్లు తెలుస్తున్నది. టీమ్ ఇండియా మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఆ పర్యటన ముగిసిన తర్వాత జట్టంతా తిరిగి ఇండియాకు వచ్చినా వీరిద్దరూ అక్కడే ఉండనున్నారు. డబ్ల్యూబీబీఎల్ ముగిసిన తర్వాతే వారిద్దరు తిరిగి రానున్నారు. స్మృతి మంధాన గతంలో డబ్ల్యూబీబీఎల్‌లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడింది.

ఇక దీప్తి శర్మ బీబీఎల్ ఆడటం ఇదే తొలిసారి. సిడ్నీ థండర్స్ కోచ్ ట్రెవొర్ గ్రిఫిన్స్ ఈ మేరకు ఇద్దరు భారత ప్లేయర్లు జట్టులో చేరారని.. వారి రాకతో జట్టు మరింత బలపడిందని అన్నారు. బీసీసీఐ పురుష క్రికెటర్లను ఇతర దేశాలు నిర్వహించే క్రికెట్ లీగ్స్‌లోకి అనుమతించడం లేదు. కానీ కేవలం మహిళా క్రికెటర్లకు మాత్రం ఇతర లీగ్స్‌లో ఆడే వెసులు బాటు కల్పించింది. భారత మహిళలు ఇటీవల ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ది హండ్రెడ్ లీగ్‌లో కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News