చిన్నారులకు సం‘రక్షణ’ కరువు
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షణ కేంద్రాలే(కొన్ని) వారికి శాపంగా మారుతున్నాయి. అందులోని సిబ్బందే వారిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దేశంలోని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్‌లలో మూడేండ్లలో చిన్నారులపై లైంగికదాడి, వేధింపులకు సంబంధించి 49కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మహిళా,శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో వెల్లడించారు. అలాగే, 2016నుంచి 2019వరకు సంరక్షణ కేంద్రాలపై 49కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా 18కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ […]
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షణ కేంద్రాలే(కొన్ని) వారికి శాపంగా మారుతున్నాయి. అందులోని సిబ్బందే వారిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దేశంలోని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్‌లలో మూడేండ్లలో చిన్నారులపై లైంగికదాడి, వేధింపులకు సంబంధించి 49కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మహిళా,శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో వెల్లడించారు. అలాగే, 2016నుంచి 2019వరకు సంరక్షణ కేంద్రాలపై 49కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా 18కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయని చెప్పారు. అయితే, బాల్యన్యాయవ్యవస్థ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. సంరక్షణ కేంద్రాలను రాష్ట్రప్రభుత్వాలు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. చిన్నారుల జీవితాలతో ఆడుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.