పొగ తాగితే.. కరోనా ముంచేస్తుంది
దిశ వెబ్ డెస్క్ : మందు బాబులకు మందు దొరకడం లేదు కానీ. పొగ రాయుళ్లకు మాత్రం సిగరెట్లు తెగ దొరుకుతున్నాయి. దీంతో వాళ్లు యథేచ్చగా సిగరెట్లు కాలుస్తున్నారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. పొగ తాగే అలవాటు ఉన్నవారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. దాని గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ కరోనా టైమ్ […]
దిశ వెబ్ డెస్క్ :
మందు బాబులకు మందు దొరకడం లేదు కానీ. పొగ రాయుళ్లకు మాత్రం సిగరెట్లు తెగ దొరుకుతున్నాయి. దీంతో వాళ్లు యథేచ్చగా సిగరెట్లు కాలుస్తున్నారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. పొగ తాగే అలవాటు ఉన్నవారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది.
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. దాని గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ కరోనా టైమ్ లో పొగ తాగితే.. ప్రాణాలకే ప్రమాదం అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. పొగతాగే వారిలో కరోనా వ్యాపించే అవకాశాలు 14రెట్లు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్ ప్రధానంగా చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడంతో వ్యాప్తి చెందుతుంది. పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు చేతి వేళ్లను పదే పదే నోటి వద్దకు తీసుకు వెళుతుంటారు. దీంతో వైరస్ నోటి ద్వారా లోపలికి వెళ్లే అవకాశం ఎక్కువ. అంతేకాదు కరోనా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తులను బలహీన పరుస్తుంది. పొగ తాగే అలవాటు ఉన్న వాళ్లకు కూడా శ్వాసకోశ ఇబ్బందులుంటాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటుంది. అందువల్ల వైరస్ త్వరగా అటాక్ చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెంచుకుంటే :
ఓ కొత్త పద్దతిని అలావాటు చేసుకోవాలంటే… 21 రోజుల పాటు కఠినంగా అది అమలు చేయాలి.. అలా కచ్చితంగా చేస్తే.. అది అలవాటుగా మారుతుందన్నది మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం. కరోనా సమయంలో పొగ తాగే అలవాటును మానుకుంటే… ఆరోగ్యంగా ఉండటంతో పాటు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దాంతో పాటు వ్యాయామం చేయడం, పౌష్టికాహారం, పండ్లు తినడం వల్ల పొగ తాగడం వల్ల కోల్పోయిన రోగ నిరోధక శక్తి తిరిగి పొందవచ్చు.
Tags: corona virus, smoking, ciggerate, imune, who