టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించడమే లక్ష్యం : స్మిత్
టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించడమే ప్రస్తుత లక్ష్యమని ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. తాజాగా లైవ్ చాట్‌లో అభిమానులతో పలు విషయాలను పంచుకున్నాడు. ప్రంపంచ కప్, యాషెస్ సిరీస్ తనకు పెద్ద విజయాలని.. ప్రస్తుత లక్ష్యం మాత్రం టీమిండియాను భారత్‌లో ఓడించడమేనని వెల్లడించాడు. అయితే, అదంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు. ఉపఖండపు పిచ్‌ల పైన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాను ఎదుర్కోవడం చాలా […]
టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించడమే ప్రస్తుత లక్ష్యమని ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. తాజాగా లైవ్ చాట్‌లో అభిమానులతో పలు విషయాలను పంచుకున్నాడు. ప్రంపంచ కప్, యాషెస్ సిరీస్ తనకు పెద్ద విజయాలని.. ప్రస్తుత లక్ష్యం మాత్రం టీమిండియాను భారత్‌లో ఓడించడమేనని వెల్లడించాడు. అయితే, అదంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు. ఉపఖండపు పిచ్‌ల పైన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాను ఎదుర్కోవడం చాలా కష్టమని, అతని బౌలింగ్ వేగంలో మార్పు లేకున్నా వేళ్ళతోనే బంతి గమనాన్ని మార్చేస్తాడని అన్నాడు. మొదట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆసీస్ జట్టులోకి వచ్చిన స్మిత్.. రెండు టెస్టులు ఆడిన తర్వాత జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాను. ఆ సమయంలోనే స్పిన్నర్‌గా వర్కౌట్ కాదని బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినట్టు స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
Tags: Team India, Australia, Steve Smith, Jadeja, Spin Bowling