4 వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా కేసులు నాలుగు వేలు దాటినట్టు కేంద్రం వెల్లడించింది. 24 గంటల వ్యవధిలోనే అత్యధికంగా.. కొత్తగా 693 కేసులు నమోదవగా, అత్యధిక మరణాలు (32) చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 4,027 మందికి కరోనా సోకినట్టు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఈ మహమ్మారితో 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది. 292 మంది ఈ కొవిడ్ 19 బారి నుంచి కోలుకున్నట్టు పేర్కొంది. మూడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 500 […]
న్యూఢిల్లీ : భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా కేసులు నాలుగు వేలు దాటినట్టు కేంద్రం వెల్లడించింది. 24 గంటల వ్యవధిలోనే అత్యధికంగా.. కొత్తగా 693 కేసులు నమోదవగా, అత్యధిక మరణాలు (32) చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 4,027 మందికి కరోనా సోకినట్టు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఈ మహమ్మారితో 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది. 292 మంది ఈ కొవిడ్ 19 బారి నుంచి కోలుకున్నట్టు పేర్కొంది.
మూడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 500 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 690 మందికి కరోనా సోకగా, తమిళనాడులో 571 మందికి కరోనా అంటుకుంది. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 503కు పెరిగింది. తెలంగాణలో 321 మందికి కరోనా సోకగా అందులో 34మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్రం వెల్లడించింది.
Tags: Coronavirus, cases, deaths, india