రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో శ్రీలంక లెజెండ్స్
దిశ, స్పోర్ట్స్ : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 రెండో సెమీఫైనల్ శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగింది. సౌత్‌ఆఫ్రికా లెజెండ్స్‌తో తలపడిన శ్రీలంక లెజెండ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌత్ఆఫ్రికా లెజెండ్స్‌ను శ్రీలంక లెజెండ్స్ బౌలర్ కులశేఖర వెన్ను విరిచాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ మోర్నే వాన్ వింక్ (53), అల్వీరో పిటర్సెన్ (27)లు తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. కులశేఖర ధాటికి వరుసగా వికెట్లు పడుతూనే […]
దిశ, స్పోర్ట్స్ : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 రెండో సెమీఫైనల్ శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగింది. సౌత్‌ఆఫ్రికా లెజెండ్స్‌తో తలపడిన శ్రీలంక లెజెండ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌత్ఆఫ్రికా లెజెండ్స్‌ను శ్రీలంక లెజెండ్స్ బౌలర్ కులశేఖర వెన్ను విరిచాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ మోర్నే వాన్ వింక్ (53), అల్వీరో పిటర్సెన్ (27)లు తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. కులశేఖర ధాటికి వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. అతడికి తోడు మిగతా బౌలర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే దక్షిణాఫ్రికా లెజెండ్స్ ఆలౌట్ అయ్యింది. 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు తిలకరత్నె దిల్షాన్ (18), సనత్ జయసూర్య (18) తక్కువ పరుగులకే అవుటైనా.. ఉపల్ తరంగా (39 నాటౌట్), చింతాక జయసింఘే (47) దూకుడుగా ఆడారు. దీంతో కేవలం 17.2 ఓవర్లలో శ్రీలంక లెజెండ్స్ 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. రెండో సెమీస్‌లో 8 వికెట్లతో గెలిచి ఫైనల్ చేరుకుంది. ఆదివారం రాత్రి ముంబయి వేదికగా శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది.