బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్‌లో అస్థి పంజరం కలకలం..

దిశ, హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నడిబొడ్డున అస్థి పంజరం కలకలం లేపింది. పట్టణంలోని విద్యానగర్‌లోని ఖాళీ ప్రదేశంలో చెట్టు పక్కన అస్థి పంజరం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జనావాసాల నడుమ ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎముగుల గూడు వెలుగులోకి రావడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దశాబ్దాల కిందట ఈ ప్రాంతంలో చనిపోయిన వ్యక్తిని సమాధి చేసి పెట్టి ఉండటంతో అది భూమిపైకి తేలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే, అస్థి పంజరం […]

Update: 2021-11-28 11:06 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నడిబొడ్డున అస్థి పంజరం కలకలం లేపింది. పట్టణంలోని విద్యానగర్‌లోని ఖాళీ ప్రదేశంలో చెట్టు పక్కన అస్థి పంజరం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జనావాసాల నడుమ ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎముగుల గూడు వెలుగులోకి రావడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దశాబ్దాల కిందట ఈ ప్రాంతంలో చనిపోయిన వ్యక్తిని సమాధి చేసి పెట్టి ఉండటంతో అది భూమిపైకి తేలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

అయితే, అస్థి పంజరం పూర్తిగా బయట కనిపించడంతో మరేదైనా కారణం ఉంటుందా? ఆన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కావాలనే ఎవరైనా దీనిని తీసుకొచ్చి పడేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది ఇక్కడ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అస్థి పంజరం ఆనవాళ్లు కనిపించలేదని చెప్తున్నారు కొందరు. స్కెల్టన్ కనిపించిన ప్రాంతంలో భూమి తవ్వినట్టు కానీ, గోతి లాంటిది ఏది కనిపించ లేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీస్తున్నారు. దశాబ్దన్నర కాలం కిందట చనిపోయిన వ్యక్తి అస్థి పంజరం అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు విచారణ జరపనున్నట్టు పోలీసులు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News