అమ్మాయి Vs అబ్బాయి.. సైజ్ మ్యాటర్స్..!?

దిశ, ఫీచర్స్ : ఓ అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంది అనుకోండి.. ఆమె చుట్టూ ఉన్న వందల కళ్లు ఒక్కచూపులోనే తన బాడీని స్కాన్ చేసేస్తాయి. కలర్.. హైట్.. వెయిట్.. నడుము.. బ్రెస్ట్ సైజ్.. జడ పొడవును జెట్ స్పీడ్‌లో క్యాలికులేట్ చేసేస్తాయి. తన ఫిజిక్‌కు అట్రాక్ట్ అయ్యారా.. ఏం పిల్లరా బాబు అని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు. లేదనుకో! ఏ గదేం పోరిరా.. పోరంటే ఆ సినిమాలో హీరోయిన్ లెక్క ఉండాలే అని కామెంట్ చేస్తారు. అంటే […]

Update: 2021-04-10 21:00 GMT

దిశ, ఫీచర్స్ : ఓ అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంది అనుకోండి.. ఆమె చుట్టూ ఉన్న వందల కళ్లు ఒక్కచూపులోనే తన బాడీని స్కాన్ చేసేస్తాయి. కలర్.. హైట్.. వెయిట్.. నడుము.. బ్రెస్ట్ సైజ్.. జడ పొడవును జెట్ స్పీడ్‌లో క్యాలికులేట్ చేసేస్తాయి. తన ఫిజిక్‌కు అట్రాక్ట్ అయ్యారా.. ఏం పిల్లరా బాబు అని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు. లేదనుకో! ఏ గదేం పోరిరా.. పోరంటే ఆ సినిమాలో హీరోయిన్ లెక్క ఉండాలే అని కామెంట్ చేస్తారు. అంటే తనను ఫిజికల్‌గా అట్రాక్ట్ చేస్తే అమ్మాయి అందంగా ఉన్నట్లు.. లేదంటే అందవిహీనంగా ఉన్నట్లా? అసలు ఆ బ్యూటీ స్టాండర్స్ క్రియేట్ చేసింది ఎవరు? అలాంటి అందాల కొలతలతో అమ్మాయిని కించపరిచేందుకు, ఆ మాటల ద్వారా తనను గాయపరిచేందుకు హక్కు ఎవరు ఇచ్చారు?

సైజ్ మ్యాటర్స్..

ఇన్‌స్టాగ్రామ్.. ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇలా సోషల్ మీడియాలో అమ్మాయి ఫొటో పోస్ట్ అయిందా? ఖతమ్ బాడీ షేమింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఈ మధ్య ఇది పాషన్ అయిపోయింది కూడా. హీరోయిన్లు లేదంటే పాపులర్ ఫిమేల్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ.. నీ న్యూడ్ పిక్ సెండ్ చేస్తావా? నీ బ్రా సైజ్ ఎంత? అని అడగడం కామన్ అయిపోయింది. ఆ విషయం అడిగేవాళ్లకు కామన్ అయుండొచ్చు కానీ ఫేస్ చేసే వాళ్లను ఇది మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తుంది. డిప్రెషన్‌లోకి తీసుకెళ్తుంది. సైజ్ రియల్లీ మ్యాటర్స్.. సైజ్ మెంటాలిటీ అనేది చాలా హానికరం.

అయినా మహిళల బ్రెస్ట్ సైజ్ మీద పురుషులకు ఎందుకంత మోహం? ఏ, బీ, సీ, డీ అని ఎందుకు వర్గీకరించి మాట్లాడాలి? ఏ.. వక్షోజాలను బాడీలో ఒక పార్ట్‌గా చూడలేరా? ఎందుకంత హైప్‌గా ఆలోచిస్తూ.. అదే స్టేట్ ఆఫ్ మైండ్‌లో బతకాలి? అమ్మాయిలు కూడా ఫ్లాట్ లేదా స్మాల్ చెస్ట్ ఉంటే ఇంప్లాంట్స్ ఎందుకు వాడాలి? ఒక డ్రెస్ కొనాల్సి వచ్చినప్పుడు చెస్ట్ సైజ్(స్మాల్/బిగ్) గురించి ఎందుకు ఆలోచించాలి? అయినా వక్షోజాలు చిన్నగా ఉంటే లేదా పెద్దగా ఉంటే తప్పు అని ఎందుకు అనుకోవాలి? బ్రెస్ట్ అనేది జస్ట్ బాడీ పార్ట్ అని మనుషులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అమ్మాయిలు దీని గురించి ఓపెన్‌గా డిస్కస్ చేసేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారు?

టైమ్ టు స్టాప్.. బ్రేక్ ద సైలెన్స్..

అబ్బాయిలు నీ సైజ్ ఎంత అని అడిగినప్పుడు.. అమ్మాయిలు తామేదో తప్పు చేసినట్లుగా నోరు మూసుకుని, మొహం కిందకు వేసుకుని ఎందుకు వెళ్లిపోవాలి. సీన్ క్రియేట్ చేయడం ఎందుకులే అనుకున్నా.. ప్రశ్నించకుండా అలా పక్కకు తప్పుకోవడం తప్పు కాదంటారా? బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన మనిషిని ‘నువ్వు మనిషివి కాదా’ అని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటారా? నిన్ను అగౌరవపరిచినప్పుడు, నీ శరీరాన్ని అవమానించినప్పుడు.. నీకు నువ్వే స్టాండ్ తీసుకోవాలి తప్పదు! అలాంటప్పుడే సైజ్ అనేది మ్యాటర్ కాకుండా ఉంటుంది.

ఓపెన్ అవ్వాల్సిందే..

అమెరికన్ మోడల్, రియాలిటీ స్టార్ క్లో కర్దాషియన్ ఇటీవలే ఓ ఫొటో పోస్ట్ చేసి, మళ్లీ రిమూవ్ చేసినందుకు మీడియా, సోషల్ మీడియా నానా రచ్చ చేసింది. కారణం.. ఎప్పుడూ ‘36-24-36’ సైజ్‌లో ఉండే బ్యూటిఫుల్ ఫొటోలను పోస్ట్ చేసే స్టార్.. ఒక్కసారిగా కాస్త లావుగా ఉన్న పిక్చర్ పోస్ట్ చేసేసరికి తట్టుకోలేకపోయారు నెటిజన్లు. అదేదో కట్టుకున్న భర్తలం అన్నట్లుగా.. తనను ఇన్నాళ్లుగా మోసం చేసిందన్న విధంగా ఫీల్ అయిపోయారు. తను పదేళ్లుగా పెట్టిన పోస్టులన్నీ కూడా ఫిల్టర్ పిక్స్ అని ఫిక్స్ అయిపోయి ఓ కాంట్రవర్సీకి తెరలేపారు.

దీంతో ఆ స్టార్.. టాప్‌లెస్‌గా బాటమ్ బికినీతో లైవ్ స్ట్రీమింగ్‌కు వచ్చి అందరి నోర్లు మూయించింది. అయినా సమాజంలో ఉన్న ప్రజల అంచనాలకు తగినట్లుగా కాదు, కేవలం తన సంతృప్తికి తగినట్లుగా మాత్రమే బతుకుతున్నానని క్లారిటీ ఇచ్చింది. తను హానెస్ట్‌గా బతుకుతున్నానని.. అబద్దాలు చెప్పడం లేదని మిలియన్ మంది మూర్ఖులకు ఒక్క వీడియో ద్వారా తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చింది. అలాంటప్పుడు నీ ఎదురుగానే, నీ బాడీ గురించి కామెంట్ చేసిన వ్యక్తిని ప్రశ్నించలేవా? అని అడుగుతోంది నేటితరం యూత్.

క్వశ్చన్ ఫర్ మెన్..

అమ్మాయి కాదు.. కనీసం ఫొటో కనబడినా బాడీ షేమింగ్ గురించి మాట్లాడే పురుషులకు ప్రజెంట్ ఫిమేల్ జనరేషన్ దగ్గర ఓ క్వశ్చన్ ఉందని అంటున్నారు. తమ బాడీని జడ్జ్ చేస్తున్న మేల్స్.. తమ సైజ్ గురించి చర్చిస్తున్న బాయ్స్.. ఇంతకీ మీ పురుషాంగం(పెన్నిస్) సైజ్ ఎంత అని ప్రశ్నిస్తున్నారు. మహిళల బ్రెస్ట్ సైజ్ మీకు మ్యాటర్ అయినప్పుడు.. మీ పెన్నిస్ సైజ్‌ గురించి ప్రశ్నించడంలో తప్పులేదని టెలివిజన్ యాక్ట్రెస్ సయంతని ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సైజ్ మెంటాలిటీ అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుందని.. సైజ్ మెంటాలిటీకి ఖచ్చితంగా ఎండ్ చెప్పాలని సూచిస్తోంది. ఈ సైజ్ అనేది క్రియేట్ చేసింది మీ ఇన్‌సెక్యూరిటీస్‌ను కవర్ చేసుకునేందుకు కాదంటారా? అని అడుగుతోంది నటి. ఇలా అడిగితే మేల్ ఇగో హర్ట్ అయినప్పుడు.. బ్రా సైజ్, బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే ఫిమేల్ ఇగో డ్యామేజ్ కాదంటారా? అని ప్రశ్నిస్తోంది..

ఫైనల్లీ..

మెంటల్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికీ ఇంపార్టెంట్.. ‘సైజ్’ అనే మెంటాలిటీ తుడిచిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెప్తున్నారు విశ్లేషకులు. బాడీ ఫిట్‌గా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మైండ్ కూడా ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, బాడీ షేమింగ్ ఆపేసి.. అన్ని బాడీ సైజ్‌లను యాక్సెప్ట్ చేసే విధంగా సొసైటీని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

Tags:    

Similar News