గోఎయిర్‌లో ఆరుగురు సీనియర్ అధికారుల రాజీనామా!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ప్రస్తుత విమానయాన రంగం పరిస్థితిని అంచనా వేసి, వ్యయాలను వీలైనంత తగ్గించుకునేందుకు గోఎయిర్ సంస్థ అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో సంస్థలోని మొత్తం 6,700 మంది ఉద్యోగుల్లో 4 వేల మందిని వేతనం లేని సెలవులపై పంపించినట్టు సమాచారం. ఈ సంక్షోభం నేపథ్యంలోనే గోఎయిర్ విమానాయన సంస్థలోని ఆరుగురు సీనియర్ అధికారులు రాజీనామా చేశారని తెలుస్తోంది. కరోనా వల్ల ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోవడంతో, గోఎయిర్ సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో […]

Update: 2020-08-20 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ప్రస్తుత విమానయాన రంగం పరిస్థితిని అంచనా వేసి, వ్యయాలను వీలైనంత తగ్గించుకునేందుకు గోఎయిర్ సంస్థ అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో సంస్థలోని మొత్తం 6,700 మంది ఉద్యోగుల్లో 4 వేల మందిని వేతనం లేని సెలవులపై పంపించినట్టు సమాచారం. ఈ సంక్షోభం నేపథ్యంలోనే గోఎయిర్ విమానాయన సంస్థలోని ఆరుగురు సీనియర్ అధికారులు రాజీనామా చేశారని తెలుస్తోంది.

కరోనా వల్ల ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోవడంతో, గోఎయిర్ సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో జారుకుంది. మార్చిలో అనేకమంది ఉద్యోగుల జీతాల్లో కోతను ప్రకటించిన సంస్థ, 60-70 శాతం సిబ్బందికి వేతనం లేని సెలవుల పథకాన్ని అమలు చేసింది. మిగిలిన 30 శాతం మంది శ్రామికశక్తికి కూడా జీతాల చెల్లింపులు రెగ్యులర్‌గా లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారణాలతోనే సంస్థలోని ఆరుగురు సీనియర్ అధికారులు రాజీనామా చేసినట్టు విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఆగష్టు ప్రారంభంలో గోఎయిర్ సంస్థ తమ ఉద్యోగులకు మూడు అవకాశాలను ఇచ్చింది.

స్వచ్చంద రాజీనామా, తొలగింపు, నిరవధిక కాలంపాటు వేతనం లేని సెలవులు. ఆ సమయంలో అర డజనుకు పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు సంస్థను విడిచిపెట్టగా, మరికొందరు వివిధ ఎంపికలను ఎంచుకున్నారని విమానయాన వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. సేల్స్, లీగల్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్లు కూడా వేతనం లేని సెలవులను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, వారు వేతనం లేని సెలవులను ఎంపిక చేసినప్పటికీ, రీకాల్ ఉండకపోవచ్చని, వారు సంస్థ నుంచి బయటపడటం మంచిదని సూచిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది.

Tags:    

Similar News