Adani Group: అమెరికా వ్యవహారంతో అదానీ గ్రూప్‌పై సమీక్ష మొదలుపెట్టిన దేశీయ బ్యాంకులు

అదానీ గ్రూప్ కంపెనీలకు కొత్తగా రుణాలను ఇచ్చే సమయంలో మరింత కఠిననంగా, సమగ్రంగా పరిశీలించాలని బ్యాంకులు భావిస్తున్నాయి.

Update: 2024-11-28 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల బిలీయనీర్ గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై అమెరికా కోర్టు ఆరోపణలు చేసిన వ్యవహారానికి సంబంధించి అదానీ గ్రూప్ మరోసారి చర్చలోకి వచ్చింది. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీలపై పలు ఏజెన్సీలు రేటింగ్ తగ్గించాయి. తాజాగా దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు అదానీ గ్రూప్ వ్యవహారంపై సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీలకు కొత్తగా రుణాలను ఇచ్చే సమయంలో మరింత కఠిననంగా, సమగ్రంగా పరిశీలించాలని బ్యాంకులు భావిస్తున్నాయి. సమీక్ష జరుపుతున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కూడా ఉన్నాయి. అయితే, ఇది అదానీ గ్రూప్‌పై బ్యాంకుల క్రెడిట్ విధానంలో ఎలాంటి మార్పును సూచించదు. బ్యాంకింగ్ వ్యవస్థ కోణంలో సాధారణ సమీక్ష జరుగుతుందని, అదానీ గ్రూప్ వల్ల ఏ బ్యాంకుపై ప్రభావం ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకారం.. మిగిలిన బ్యాంకుల కంటే ఎస్‌బీఐ అదానీ గ్రూప్‌నకు అత్యధికంగా రూ. 33,800 కోట్ల రుణాలను ఇచ్చింది. పూర్తయ్యే దశలో ఉన్న, కొనసాగుతున్న అదానీ ప్రాజెక్ట్‌లకు ఎస్‌బీఐ రుణాలు ఇవ్వడం ఆపివేయదు, అయితే గ్రూప్ అన్ని నిబంధనలు, షరతులు పాటిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి రుణాలను పంపిణీ చేసేటప్పుడు బ్యాంక్ తగిన జాగ్రత్తలు పాటిస్తుంద్నై సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News