ఆరుగురు యూకే ప్రయాణికులకు కరోనా.. కొత్త వైరసేనా?

న్యూఢిల్లీ : యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు […]

Update: 2020-12-22 05:35 GMT

న్యూఢిల్లీ : యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే నుంచి వచ్చే అన్నిరకాల విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ నిర్ధారిస్తుందని, ప్రయాణికుల శాంపిల్స్‌ను పంపించామని చెప్పారు.

ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా అక్కడి విమానాశ్రయంలో కరోనా పాజిటివ్‌గా తేలింది.

Tags:    

Similar News