వాగులో మునిగి అక్కా, తమ్ముడు మృతి
దిశ ములుగు: స్నానాలు చేసేందుకు జంపన్న వాగులోకి దిగిన అక్కాతమ్ముళ్లు మృతిచెందారు. ఈ ఘటన ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రెడ్డిగూడెంకు చెందిన మెండు సంపత్ రెడ్డికి జంపన్న వాగు ఒడ్డున పొలం ఉంది. ఈ క్రమంలో వడ్ల రాశిని ఎండబెట్టి ఎందుకు మధ్యాహ్నం సమయంలో కూతురు జాహ్నవి( 12), కుమారుడు హేమంత్ రెడ్డి( 8 )లతో కలిసి పొలానికి వెళ్లారు. సంపత్ రెడ్డి వడ్లు ఎండ పెడుతున్న సమయంలో […]
దిశ ములుగు: స్నానాలు చేసేందుకు జంపన్న వాగులోకి దిగిన అక్కాతమ్ముళ్లు మృతిచెందారు. ఈ ఘటన ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రెడ్డిగూడెంకు చెందిన మెండు సంపత్ రెడ్డికి జంపన్న వాగు ఒడ్డున పొలం ఉంది. ఈ క్రమంలో వడ్ల రాశిని ఎండబెట్టి ఎందుకు మధ్యాహ్నం సమయంలో కూతురు జాహ్నవి( 12), కుమారుడు హేమంత్ రెడ్డి( 8 )లతో కలిసి పొలానికి వెళ్లారు. సంపత్ రెడ్డి వడ్లు ఎండ పెడుతున్న సమయంలో పిల్లలు జంపన్న వాగు వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులు పనిలో ఉండి వారు గమనించక పోవడంతో పిల్లలు చెక్ డ్యాం వద్దకు వెళ్లి వాగులోకి దిగి మునిగిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. స్థానికుల సాయంతో వాగులో గాలించి, వెళికి తీసారు. పిల్లలిద్దరూ మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తులందరి చేత కంటనీరు తెప్పించింది.