సార్.. మా కుక్కకు జ్వరం.. వదిలేయండి..
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సార్ మా కుక్క జ్వరంతో వణుకుతుంది.. మందులు వేయకపోతే చచ్చి పోయేలా ఉంది.. చూస్తూ..చూస్తూ.. ఇంట్లో ఉంచలేకపోతున్నాం.. డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నా దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి అంటూ ఓ శునక యజమాని లాక్‌డౌన్ సమయంలో బయటికి వచ్చి పోలీసులకు చిక్కగా ఆ కుక్కను చూపిస్తూ వేడుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఫిలింనగర్‌లోని సీవీఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సార్ మా కుక్క జ్వరంతో వణుకుతుంది.. మందులు వేయకపోతే చచ్చి పోయేలా ఉంది.. చూస్తూ..చూస్తూ.. ఇంట్లో ఉంచలేకపోతున్నాం.. డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నా దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి అంటూ ఓ శునక యజమాని లాక్‌డౌన్ సమయంలో బయటికి వచ్చి పోలీసులకు చిక్కగా ఆ కుక్కను చూపిస్తూ వేడుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఫిలింనగర్‌లోని సీవీఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి కారులో శునకాన్ని తీసుకెళ్తూ కనిపించాడు. బయటికి ఎందుకు వచ్చారని ఎస్సై నవీన్‌రెడ్డి ప్రశ్నించగా కుక్కకు బాగా జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ జవాబు విని పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. హృదయవిదారకమైన ఈ ఘటన పోలీసులను కూడా చలింపజేసింది. దీంతో శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ అతడిని వదిలిపెట్టారు. కానీ అతడు చెప్పిన విషయంలో ఎంత నిజముందో తెలియదు.