విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి: సింకారు శివాజీ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటపైన జాతీయ జెండా ఎగురవేయాలని సింకారు శివాజీ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని విజ్ఙప్తి చేశారు. MIM పార్టీకి భయపడి విమోచన దినోత్సవం జరపకుండా ఉండటం సరికాదన్నారు. ఇది నాలుగు రాష్ట్రాల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కలిగిన రోజు […]

Update: 2021-09-16 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటపైన జాతీయ జెండా ఎగురవేయాలని సింకారు శివాజీ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని విజ్ఙప్తి చేశారు. MIM పార్టీకి భయపడి విమోచన దినోత్సవం జరపకుండా ఉండటం సరికాదన్నారు. ఇది నాలుగు రాష్ట్రాల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కలిగిన రోజు హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు సెప్టెంబరు 17వ తేదీన జాతీయ జెండా ఎగురవేసినట్టే తెలంగాణలో కూడా నిర్వహించాలని శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ కోరారు.

Tags:    

Similar News