వివాదంలో మంగ్లీ బోనాల పాట.. ఫేమస్ కాగానే దేవుళ్లని అవమానిస్తారా..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ గా మారింది సింగర్ మంగ్లీ. జానపద పాటలను, తెలంగాణ బోనాల పాటలను తనదైన స్టైల్ లో పాడుతూ పేరుతెచ్చుకున్న మంగ్లీ  ఇటీవల సినిమాలలో కూడా ఊర మాస్ సాంగ్స్ పాడుతూ టాప్ సింగర్ గా కొనసాగుతుంది. తెలుగు పండగలకు ప్రతి ఏటా ప్రత్యేక గీతాలను విడుదల చేస్తుండే మంగ్లీ.. ఈ నెల 11 న ఈ ఏడాది బోనాలు పాటను విడుదల చేసింది.  ఆ పాట  నెట్టింట […]

Update: 2021-07-17 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ గా మారింది సింగర్ మంగ్లీ. జానపద పాటలను, తెలంగాణ బోనాల పాటలను తనదైన స్టైల్ లో పాడుతూ పేరుతెచ్చుకున్న మంగ్లీ ఇటీవల సినిమాలలో కూడా ఊర మాస్ సాంగ్స్ పాడుతూ టాప్ సింగర్ గా కొనసాగుతుంది. తెలుగు పండగలకు ప్రతి ఏటా ప్రత్యేక గీతాలను విడుదల చేస్తుండే మంగ్లీ.. ఈ నెల 11 న ఈ ఏడాది బోనాలు పాటను విడుదల చేసింది. ఆ పాట నెట్టింట వైరల్ గా మారింది కూడా. అయితే ఆమె పాడిన ఈ పాట వివాదంలో ఇరుక్కుంది. ‘చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..’ అంటూ సాగే ఈ పాటను రిక్స్ రామస్వామి రాయగా, రాకేష్ వెంటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్‌పై కూడా కనిపించారు.

‘ఢీ’ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాట లిరిక్స్‌ హిందూ దేవతలను అవమానించేకరంగా ఉన్నాయని ఆర్జే కిరణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియో ను విడుదల చేశారు. బోనాలు పండగ వేళ అమ్మవారిని కీర్తిస్తూ పాడాలి కానీ, ఇలా అమ్మను అవమానిస్తున్నట్లు పాడడమేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు దేవతలను పొగిడేలా పాడిన మంగ్లీ.. కొంచెం ఫేమస్ వచ్చేసరికి దేవతలని అవమానించేలా ఎదిగావా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా టైమ్ మించిపోలేదని, ఆ లిరిక్స్ ని మార్చి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామ దేవతలను కించపరిచేలా చేసిన వాక్యాలను తొలగించాలని తెలిపారు. ఈ వివాదానిపై కొందరు నెటిజన్లు సింగర్ మంగ్లీకి మద్దతుగా నిలిచారు. అందులో ఆమె తప్పేం లేదని, లిరిక్స్ ఆమె రాయదనిఅంటున్నారు. అలాగే ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News