ఢిల్లీ అల్లర్ల కేసు.. దీప్ సిద్ధుకు 7రోజుల కస్టడీ!

దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. భారీ‌కేడ్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేయడంతో పాటు ఎర్రకోటపై కిసాన్ జెండాను ఆవిష్కరించడం.. 200 మంది ఢిల్లీ పోలీసులు గాయాలతో ఆస్పత్రుల పాలు కావడానికి ఆందోళన కారులను రెచ్చగొట్టిన వారిలో రైతు సంఘాల నాయకులతో పాటు దీప్ సిద్ధు ఒకరు. గణతంత్ర వేడుకల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్రం పలువురు రైతు సంఘాల నాయకులపై […]

Update: 2021-02-09 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. భారీ‌కేడ్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేయడంతో పాటు ఎర్రకోటపై కిసాన్ జెండాను ఆవిష్కరించడం.. 200 మంది ఢిల్లీ పోలీసులు గాయాలతో ఆస్పత్రుల పాలు కావడానికి ఆందోళన కారులను రెచ్చగొట్టిన వారిలో రైతు సంఘాల నాయకులతో పాటు దీప్ సిద్ధు ఒకరు.

గణతంత్ర వేడుకల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్రం పలువురు రైతు సంఘాల నాయకులపై కేసులు పెట్టింది. అందులో పంజాబ్‌కు చెందిన సింగర్, యాక్టర్ దీప్ సిద్ధు కూడా ఉన్నారు. ఢిల్లీ హింసాత్మక ఘటనల తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన అతన్ని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం హైకోర్టు ఎదుట హాజరుపరచగా అతనికి 7రోజుల కస్టడీ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News