రాజుది ఆత్మహత్య కాదు.. అనుమానాస్పదమే..!

దిశ, వెబ్‌డెస్క్: వెయ్యి మంది పోలీసులు ఆరు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్న సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. అనుమానస్పద మృతిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 171 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. మృతదేహం పడి ఉన్న తీరు అనుమానస్పదంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాజు భార్య మౌనిక […]

Update: 2021-09-16 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెయ్యి మంది పోలీసులు ఆరు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్న సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. అనుమానస్పద మృతిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 171 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. మృతదేహం పడి ఉన్న తీరు అనుమానస్పదంగా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు రాజు భార్య మౌనిక సైతం తన భర్తది హత్యే అని ఆరోపిస్తోంది. మరోవైపు ఓ మంత్రి రాజును ఎన్ కౌంటర్ చేయాలని బహిరంగ వేదికపై డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజు మృతిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా సమాచారం లేనప్పటికీ హైదరాబాద్, వరంగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాజు హత్యాచారం తర్వాత ఏ దుస్తులు, హెయిర్ కటింగ్ తో వెళ్లాడో అదే బట్టలపై ఉన్నాడు. అతడి చేతిపై టాటును కూడా ఉండటంతో మృతుడు రాజుగా ప్రకటించారు. అతడి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించనున్నారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు.

Tags:    

Similar News