ఇండియన్ సాంగ్‌కు స్టెప్పులేసిన సింగపూర్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
దిశ, సినిమా : సింగపూర్‌కు చెందిన ఓ టిక్ టాక్ బృందం.. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్’ నుంచి ‘బోలే చుడియన్’ సాంగ్‌కు స్టెప్పులేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒరిజినల్ సాంగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రదర్శించడం ఆకట్టుకుంటోంది. సినిమా పాటలోని కొరియోగ్రఫీని అచ్చుగుద్దినట్టు దింపేసిన టిక్ టాకర్స్.. డ్యాన్స్ మూమెంట్స్‌ను అంతే గ్రేస్‌తో చేస్తూ, హావభావాలను సైతం హీరోహీరోయిన్లకు తగ్గకుండా ఫాలో అయ్యారు. కాగా ఓ […]
దిశ, సినిమా : సింగపూర్‌కు చెందిన ఓ టిక్ టాక్ బృందం.. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్’ నుంచి ‘బోలే చుడియన్’ సాంగ్‌కు స్టెప్పులేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒరిజినల్ సాంగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రదర్శించడం ఆకట్టుకుంటోంది. సినిమా పాటలోని కొరియోగ్రఫీని అచ్చుగుద్దినట్టు దింపేసిన టిక్ టాకర్స్.. డ్యాన్స్ మూమెంట్స్‌ను అంతే గ్రేస్‌తో చేస్తూ, హావభావాలను సైతం హీరోహీరోయిన్లకు తగ్గకుండా ఫాలో అయ్యారు. కాగా ఓ నెటిజన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ క్రమంలో వీళ్ల ప్రతిభను మెచ్చకుంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ‘బ్రిలియంట్ కొరియోగ్రఫీ, చాలా అద్భుతంగా చేశారు. కరీనా కపూర్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం అమేజింగ్’ అంటున్నారు. ఇక ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలో ఈ పాటకు కరీనా కపూర్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, కాజోల్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
Tik Tok, a gift that keeps on giving. pic.twitter.com/4XPQaJBbRl
— christopher koulumbus (@shivillex) November 5, 2021